Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలానికి అనుగుణంగా బాణీలు కూర్చిన ఎమ్.ఎస్.విశ్వనాథన్

కాలానికి అనుగుణంగా బాణీలు కూర్చిన ఎమ్.ఎస్.విశ్వనాథన్
, గురువారం, 24 జూన్ 2021 (11:58 IST)
MS Vishwanathan
(జూన్ 24న ఎమ్.ఎస్.విశ్వనాథన్ జయంతి)
స్వ‌ర్ణ‌యుగం సామ్రాజ్యంలో ఒక‌రైన ఎమ్.ఎస్.విశ్వనాథన్ ను అభిమానులు ఎం.ఎస్‌. అని పిలుచుకునేవారు. జూన్ 24, 1928లో కేర‌ళ‌లోని పాల్‌ఘాట్ లో జ‌న్మించారు. ఆయ‌న వెయ్యి సినిమాల‌కుపైగా స్వ‌రాలు స‌మ‌కూర్చారు. 13 ఏళ్ళ వ‌య‌స్సులోనే సంగీతంలోని మెళ‌కువ‌ల‌ను నేర్చుకున్నారు. తొలుత సి.ఆర్‌. సుబ్బ‌రామ‌న్‌తో క‌లిసి `దేవ‌దాసు`, లైలా మ‌జ్ఞు సినిమాల‌కు ప‌నిచేశారు. సుబ్బురామన్ దగ్గరే టి.కె.రామ్మూర్తితో పరిచయం ఏర్పడింది. సి.ఆర్.సుబ్బురామన్ స్వరకల్పన చేసిన “రత్నమాల, లైలా-మజ్ను, చండీరాణి” చిత్రాలకు విశ్వనాథన్-రామ్మూర్తి ఇద్దరూ సహాయకులుగా పనిచేశారు. ‘దేవదాస్’ చిత్రంలోని అన్ని పాటలకూ స్వరకల్పన చేసిన సుబ్బురామన్ హఠాన్మరణంతో అందులోని “జగమే మాయ బ్రతుకే మయ‌” పాటకు విశ్వనాథన్-రామ్మూర్తి బాణీలు క‌ట్టాల్సి వ‌చ్చింది. 
 
విశ్వనాథన్, రామ్మూర్తి సంగీత ద్వయం తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో జైత్రయాత్ర చేసింది. ఆ నాటి ప్రముఖ గాయనీగాయకులతో మొట్టమొదటిసారి లైవ్ పెర్ ఫామెన్స్ ఇచ్చిన ఘనత విశ్వనాథన్-, రామ్మూర్తి ద్వయానిదే!  ఆ త‌ర్వాత రామ్మూర్తితో కొంత గేప్ వ‌చ్చింది. సోలోగా విశ్వ‌నాథ‌న్ బాణీలు చేస్తూ వంద సినిమాలకు ప‌నిచేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాలకు సంగీతం సమకూర్చారు.
 
ఆయ‌న కాలంతోపాటు మారుతూ సినిమాలు చేశారు. `పిల్ల‌లు దేవుడు చ‌ల్ల‌నివారే.. క‌ల్ల‌క‌ప‌టం ఎరుగ‌ని క‌రుణామ‌యులే.` అనే పాట నుంచి క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన అంద‌మైన అనుభ‌వం కోసం`కుర్రాళ్ళు కుర్రాళ్ళు.. అంటూ ఊపు తెప్పించే పాట‌ల‌కు ఆయ‌న బాణీలు స‌మ‌కూర్చారు. ఎన్నో సినిమాల‌లో ఆయ‌న సంగీతం ప్ర‌జాద‌ర‌ణ పొందింది. లేత‌మ‌న‌సులు, స‌త్తెకాల‌పు స‌త్తెయ్య‌, అంతులేని క‌థ‌, సింహ‌బ‌లుడు, ఇది క‌థ‌కాదు, గుప్పెడు మ‌న‌స్సు, అంద‌మైన అనుభ‌వం, ఆక‌లిరాజ్యం వంటి చిత్రాలు ఎంతో పేరు తెచ్చాయి. ఆయ‌న చిర‌కాలంలో అనారోగ్యంతో 14 జూలై 2015న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. భౌతికంగా విశ్వనాథన్ లేకపోయినా, ఆయన సంగీతం మనలను సదా ఆనందింప చేస్తూనే ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Actress Vijayashanti birth day: బాలయ్యతో 17 చిత్రాలు.. రాములమ్మ సినీ ప్రస్థానం