పాండమిక్ టైమ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలే అవసరం. డిజె టిల్లు అలాంటి చిత్రమే అంటున్నారు యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన డిజె టిల్లు చిత్రాన్ని దర్శకుడు విమల్ కృష్ణ రూపొందించారు. ఈ నెల 12న టిజె టిల్లు థియేటర్ లలో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ చిత్ర విశేషాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
- కృష్ణ అండ్ హిస్ లీల సినిమా చూశాక సిద్ధును పిలిచి కథ ఉంటే చెప్పమన్నాను. అతను రొమాంటిక్ కామెడీస్ ఉన్నాయని అన్నాడు. ఒట్టి రోమ్ కామ్ వద్దులే ఇంకేదైనా కథ చూడు అన్నాను. అప్పుడు లవ్ స్టోరీకి క్రైమ్ యాంగిల్ కలిపి యూత్ ఫుల్ కథను చెప్పాడు. సిద్దు ఈ కథ చెబుతున్నంత సేపూ బాగా నవ్వుకున్నాను. అయితే ఆ చెప్పిన కథకు ఫైనల్ వెర్షన్ కు మధ్య చాలా మార్పులు చేర్పులు చేశాం.
- మేము కథ ఓకే అనుకున్నాక త్రివిక్రమ్ గారికి చెబుతాం. ఆయన కథకు చేయాల్సిన మార్పులు, సలహాలు చెబుతారు. డిజె టిల్లు సినిమా కంప్లీట్ అయ్యాక కూడా కొన్ని మార్పులు చేశాం. ఫైనల్ వెర్షన్ మాత్రం హిలేరియస్ గా వచ్చింది.
- పాండమిక్ లో పరిస్థితులు మనం చూస్తున్నాం. కుటుంబ ప్రేక్షకుల బయటకు రావడం లేదు. రంగ్ దే కు మంచి టాక్ వచ్చినా ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా రాలేదు, అలాగే వరుడు కావలెను కూల్ లవ్ ఎంటర్ టైనర్ అని నమ్మకం పెట్టుకున్నాం. దానికీ ఆశించినంతగా రెస్పాన్స్ రాలేదు. ఏమైనా బాక్సాఫీస్ దగ్గర మనం అనుకున్నట్లు లేదు అని అర్థమైంది. ఇవాళ డిజె టిల్లు చిత్రానికి సిద్ధూ ఆల్మోస్ట్ ఒక కొత్త హీరో అయినా హైదరాబాద్, విశాఖలో థియేటర్స్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయి.
- డిజె టిల్లు యూత్ ఫుల్ సినిమా కానీ అడల్డ్ చిత్రం కాదు. ముద్దు సీన్స్ కూడా అడల్ట్ కిందకు వస్తాయనుకుంటే సరికాదు. ఇవాళ తెరకెక్కుతున్న కంటెంట్ ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. అమ్మాయి కోణంలో సాగే చిత్రమిది. టిల్లు ఒక అమాయక పాత్ర మాత్రమే. అతన్ని హీరోయిన్ ఆడుకుంటుంది. దానిలోనుంచే వినోదం పుడుతుంది.
_ డిజె టిల్లు మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు మంచి విజయం సాధించటం ఈ చిత్రానికి చాలా ప్లస్ అయింది. రామ్ మిరియాల కంపోజ్ చేసి పాడిన డిజె టిల్లు సాంగ్ కానీ, అలాగే అనిరుద్ పాడిన పటాసు పిల్ల పాట, సిద్దు పాడిన మరో పాట ఇలా అన్నీ దేనికవే బాగా ఆకట్టుకున్నాయి.
- ఇవాళ్టి హీరోలు శేషు, నవీన్ పోలిశెట్టి లాంటి వాళ్లంతా మల్టీటాలెంటెడ్. సిద్ధు కూడా అలాంటివాడే. అతని రైటింగ్ స్టైల్ ట్రైలర్ లో చూసే ఉంటారు. కావాల్సినంత రాసి, అంత బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు సిద్ధు. సినిమా మొత్తం టిల్లు మాట్లాడుతూనే ఉంటాడు. ఆ మాటలన్నీ మిమ్మల్ని నవ్విస్తాయి. మంచి ఫన్ ఫిల్మ్ చూశామనే సంతృప్తి డిజె టిల్లు కలిగిస్తుంది.
- డిజె టిల్లుకు సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. అందుకే సినిమాను అలాంటి సందర్భంలో ఎండ్ చేశాం.
- కంఫర్ట్ రిలీజ్ కోసమే శనివారం థియేటర్ లలోకి వస్తున్నాం. శుక్రవారం రవితేజ ఖిలాడీ సినిమా ఉంది. మాస్ హీరో అతను, మా హీరో కొత్త. డిజె టిల్లుకు ఒక రోజు ఆలస్యమైనా ఫర్వాలేదు. శని, ఆది వారంతో పాటు వాలెంటైన్స్ డే కలిసొస్తుంది. అది చాలు. వాస్తవానికి డిజె టిల్లు మరో వారం ఆగి ఈ నెల 18న విడుదల చేద్దామనుకున్నాం కానీ అంతా బాగుంటే భీమ్లా నాయక్ 25న రిలీజ్ చేస్తాం. అందుకే ఈ సినిమాను ఓ వారం ముందే విడుదల చేస్తున్నాం.
- సితారలో యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి కారణం వాళ్లు సినిమాలను కొత్తగా ప్రెజెంట్ చేస్తారని నమ్మడమే. లాక్ డౌన్ టైమ్ లో చాలా కథలు విన్నాం. సినాప్సిస్ నచ్చితే వెంటనే సినిమా ఆఫర్ చేస్తున్నాం. అలా స్వాతిముత్యం, నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమాలు అలా ఇన్నోవేటివ్ అప్రోచ్ తో చేస్తున్నవే.