ఈ మధ్య యూత్ సినిమాల పేరిట సన్నివేశాలు, డైలాగ్స్‌లతో ఊదర గొడుతున్నారు. ద్వందార్థాల డైలాగ్ లు ఎక్కువయ్యాయి. అదేమంటే ఇప్పటి ట్రెండ్ అదే అంటున్నారు. ఇటీవలే డి.జె. టిల్లు సినిమాలో కూడా అటువంటి డైలాగ్స్ వున్నాయి. ఓ అమ్మాయి అబ్బాయిని ప్రేమించి మోసం చేస్తే ఎలా వుంటుందనేది కాన్సెప్ట్. ఆ అమ్మాయికి పలువురితో ఎఫైర్ పెట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఓ డైలాగ్ కూడా వుంది. హీరోకు ఫ్రెండ్ ఫోన్ చేస్తే, నా స్వంత పొలం అనుకున్నా. కానీ ఆ పొలం ఎందరితో అంట. అందుకే బిర్యానీ తినడానికి హోటల్‌కు వెళుతున్నానంటూ.. ఓ అమ్మాయి మోసం చేసిన సందర్భంగా చెప్పే డైలాగ్‌లు. ఇవి పరమ ఊర మాస్ డైలాగ్‌లు. ఇలా కొన్ని వున్నరాయి. వీటిపై సెన్సార్ వారు అభ్యంతరం కూడా చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు విమల్ కృష్ణ, హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా సన్నివేశపరంగా ప్రెస్టేషన్‌లో ఇలా వచ్చాయని సెన్సార్‌కు క్లారిటీ ఇచ్చారు.
కానీ వారు అందుకు సమ్మతించలేదు. కానీ మరింత వివరంగా చెబితే కొన్ని బీప్ సౌండ్‌లు, కొన్ని కట్‌లు ఇచ్చి మొత్తానికి సెన్సార్ అయిందనిపించారు. అందుకే ఈ సినిమాను ఈనెల 11న విడుదల చేయాల్సింది. కొన్ని ఎడిటింగ్‌లో మార్పులు చేయడంతో ఈనెల 12న విడుదలకాబోతుంది. దర్శకుడు విమల్ కృష్ణ ఈ సినిమాపై కొన్ని సెన్సార్ కట్ చేసినా సినిమా విజయంపై నమ్మకంతో వున్నామని తెలియజేశాడు.