Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోహన్‌బాబు నటప్రస్థానం@41.. ముక్కుసూటి మనిషి.. త్వరలో ఫ్యామిలీతో కొత్త సినిమా?

విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటప్రస్థానానికి నేటితో నాలుగు దశాబ్ధాలు దాటిపోయాయి. జీవితంలో ఎలా రాణించాలో తెలుసుకుని.. ఇక్కట్లు, చిక్కుల్లో మంచి మార్గాన్ని అన్వేషించి ఉత్తమ ఫలితాలను ఆస్వాదించడ

Advertiesment
Mohan Babu completes 40 years in Tollywood
, మంగళవారం, 22 నవంబరు 2016 (12:17 IST)
విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటప్రస్థానానికి నేటితో నాలుగు దశాబ్ధాలు దాటిపోయాయి. జీవితంలో ఎలా రాణించాలో తెలుసుకుని.. ఇక్కట్లు, చిక్కుల్లో మంచి మార్గాన్ని అన్వేషించి ఉత్తమ ఫలితాలను ఆస్వాదించడం నేర్చుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. అలా ముళ్ల చిక్కుల్లో మార్గాన్ని ఎంచుకుని నటుడిగా మారిన వ్యక్తే మోహన్ బాబు. 
 
డా.మంచు మోహన్‌బాబు. విలన్‌గా ఆయన సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి మంగళవారానికి నలభై వసంతాలు పూర్తవుతున్నాయి. డైలాగులు పలకడంలో తనదైన శైలిని కనబరిచి డైలాగ్‌ కింగ్‌గా ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న మోహన్ బాబు.. శ్రీలక్ష్మీ ప్రసన్న మూవీస్‌తో నిర్మాతగా మారి కుటుంబ విలువలున్న చిత్రాలను నిర్మించి ఉత్తమాభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. 
 
విద్యానికేతన్ సంస్థలతో విద్యావేత్తగా మారి కులమతాలకు అతీతంగా తనవంతుగా కొంతమేర పేద విద్యార్థులకు విద్యదానం చేస్తూ ఆ రంగంలోనూ ప్రశంసలు పొందుతున్నారు. ముక్కుసూటి మనిషిగా పేరు తెచ్చుకున్న డా.మంచుమోహన్‌బాబుని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇక మోహన్ బాబు అడుగుజాడల్లోనే లక్ష్మీ మంచు, మంచు విష్ణు, మంచు మనోజ్‌ సినిమా రంగంలో కొనసాగుతున్నారు. 
 
ఇటీవలే మామ మంచు అల్లుడు కంచు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్ బాబు.. త్వరలో తన ఫ్యామిలీ నటులతోనే కలిసి తెరపై కనిపించబోతున్నాడని.. ఈ చిత్రంలో మంచు లక్ష్మికి.. మోహన్ బాబుల పాత్రలు ఛాలెంజింగ్‌గా ఉంటాయని సినీ జనం అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ శ్రీదేవితో షారూఖ్ కుమారుడు ఆర్యన్ రొమాన్స్.. కరణ్ కొత్త సినిమా ప్లాన్..