Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూనియర్ శ్రీదేవితో షారూఖ్ కుమారుడు ఆర్యన్ రొమాన్స్.. కరణ్ కొత్త సినిమా ప్లాన్..

జూనియర్ శ్రీదేవి తెరంగేట్రం ఖరారైపోయింది. గతంలో శ్రీదేవి కూతురు జాహ్నవి హీరోయిన్‌గా మహేష్‌బాబు-మణిరత్నం మూవీతో హీరోయిన్‌గా పరిచయం చేయాలని జోరుగా ప్రచారం సాగింది. ఇవి ప్రస్తుతం పుకార్లుగానే మిగిలిపోయాయ

Advertiesment
Karan Johar opens up on Jhanvi Kapoors debut in the Sairat remake
, మంగళవారం, 22 నవంబరు 2016 (11:41 IST)
జూనియర్ శ్రీదేవి తెరంగేట్రం ఖరారైపోయింది. గతంలో శ్రీదేవి కూతురు జాహ్నవి హీరోయిన్‌గా మహేష్‌బాబు-మణిరత్నం మూవీతో హీరోయిన్‌గా పరిచయం చేయాలని జోరుగా ప్రచారం సాగింది. ఇవి ప్రస్తుతం పుకార్లుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం శ్రీదేవి తన కూతురిని లాంఛ్ చేసే బాధ్యతని బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ చేతిలో పెట్టిందట.
 
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో మహేష్ భట్ కూతురు ఆలియా భట్‌ని హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేసిన కరణ్.. అలియా భట్ వరుస ఆఫర్లతో దూసుకుపోతుండటంతో.. ఇదే తరహాలో తన కుమార్తె కూడా బిటౌన్‌లో మెరిసిపోవాలని శ్రీదేవి భావిస్తుందట. దీంతో జూనియర్ శ్రీదేవిని మరాఠీ రీమేక్ 'సైరత్'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టించాలని ప్లాన్ చేస్తున్నాడట కరణ్ జోహార్. 
 
కేవలం నాలుగు కోట్లతో తెరకెక్కిన సైరట్ రికార్డులు క్రియేట్ చేస్తూ వందకోట్లు రాబట్టింది. ఈ లవ్ స్టోరీలో జూనియర్ శ్రీదేవితో షారుక్ కొడుకు ఆర్యన్‌ని హీరోగా సినిమా చేసేందుకు కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కన్నా నా ఎప్ప వరువేన్‌, ఎప్పడి వరువేన్‌.. యారుక్కుం తెరియాదు'.. అతిథులతో 'రోబో' రజినీకాంత్‌