Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'కలెక్షన్ కింగ్' మోహన్ బాబు 45 యేళ్ల సినీ ప్రస్థానం

Advertiesment
Mohan Babu Journey
, ఆదివారం, 22 నవంబరు 2020 (17:57 IST)
టాలీవుడ్‌లో కలెక్షన్ కింగ్ ఎవరంటే.. ఠక్కున చెప్పే పేరు డాక్టర్ మోహన్ బాబు. ఈయన సినీ రంగంలోకి అడుగుపెట్టి 45 యేళ్లు. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న అరుదైన వ్యక్తిత్వం ఉన్న నటుడు. 
 
సినీ రంగ ప్రయాణంలో నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు. విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, హీరో ఇలా 560కి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించి నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. 
 
డైలాగ్స్‌ చెప్పడంలో మోహన్‌బాబు రూటే సెపరేటు అని ప్రేక్షకులతో మెప్పును పొందారీయన. నిర్మాతగా మారి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌ను స్టార్ట్‌ చేసి 50కిపైగా సినిమాలు చేసి అభిరుచి గల నిర్మాతగానూ రాణించారు. 
 
శ్రీవిద్యానికేతన్‌ విద్యా సంస్థను స్థాపించి విద్యావేత్తగానూ సమర్ధవంతమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. నేటితో సినీ రంగంలోకి ఆయన అడుగు పెట్టి 45 సంవత్సరాలు పూర్తయ్యింది. ఇంకా ఆయన సినీ రంగానికి తన సేవలను అందిస్తున్నారు. 
 
తాజాగా ఆయన కీలక పాత్రలో నటించిన "ఆకాశం నీ హద్దురా" సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరో వైపు ఆయన టైటిల్‌ పాత్రలో 'సన్నాఫ్‌ ఇండియా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ లెజెండ్రీ యాక్టర్‌కి సోషల్ మీడియా వేదికగా అందరూ అభినందనలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్‌కు మళ్లీ అస్వస్థత.. ఆందోళనలో ఫ్యాన్స్..