Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు ప్రజల ఉనికిని తెలుపడానికి అప్పుడు అన్నయ్య ఎన్టీఆర్.. ఇప్పుడు రాజమౌళి.. మోహన్ బాబు ప్రశంస

బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో నింగినీ, నేలనూ ఏకం చేసిన బాహుబలి 2 సినిమాను ప్రశంసించేవారిలో మోహన్ బాబు కూడా చేరిపోయారు. భారత దేశంలో తెలుగు ప్రజలు ఉన్నారని మొదటిసారిగా ఎన్టీఆర్ ప్రపంచానికి తెలిపితే ఇప్పుడు తెలుగువాళ్లలో ఒక ప్రపంచ స్థాయి దర్శకుడు ఉన్నాడన

తెలుగు ప్రజల ఉనికిని తెలుపడానికి అప్పుడు అన్నయ్య ఎన్టీఆర్.. ఇప్పుడు రాజమౌళి.. మోహన్ బాబు ప్రశంస
హైదరాబాద్ , గురువారం, 4 మే 2017 (02:15 IST)
బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో నింగినీ, నేలనూ ఏకం చేసిన బాహుబలి 2 సినిమాను ప్రశంసించేవారిలో మోహన్ బాబు కూడా చేరిపోయారు. భారత దేశంలో తెలుగు ప్రజలు ఉన్నారని మొదటిసారిగా ఎన్టీఆర్ ప్రపంచానికి తెలిపితే ఇప్పుడు తెలుగువాళ్లలో ఒక ప్రపంచ స్థాయి దర్శకుడు ఉన్నాడని బాహుబలి ద్వారా రాజమౌళి నిరూపించాడు అంటూ మోహన్ బాబా ఆకాశానికి ఎత్తేశాడు. ఒక తెలుగు రచయితగా విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినందుకు ఆత్మీయుడిగా గర్విస్తున్నాను అంటూ బాహుబలి కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ను ప్రశంసల వర్షంలో ముంచెత్తాడు మోహన్ బాబు.
 
బాహుబలి 2 సినిమాను చూసిన తర్వాత మోహన్ బాబు బాహుబలి టీమ్‌ను మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.  ‘ప్రియమైన రాజమౌళి.. భారతదేశంలో తెలుగు ప్రజలు ఉన్నారని అన్నయ్య ఎన్.టి రామారావు గారి ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక గొప్ప దర్శకుడు ఉన్నాడని బాహుబలి ద్వారా నువ్వు చాటి చెప్పావు. నీ తల్లిదండ్రుల ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని, అర్ధాంగి ‘రమ’ ప్రేమానురాగాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను.. ప్రియమైన ప్రసాద్.. బాహుబలి విజయంతో 'విశ్వ విజయేంద్రప్రసాద్‌'గా సార్థక నామధేయుడివి అయ్యావు. ఒక తెలుగు రచయితగా విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినందుకు ఆత్మీయుడిగా గర్విస్తున్నాను’ అని బాహుబలి2 టీంను మోహన్ బాబు అభినందనలతో ముంచెత్తారు.
 
‘డియర్ శోభు యార్లగడ్డ-ప్రసాద్ దేవినేని, నిర్మాతలు లేనిదే సినిమా పరిశ్రమ లేదు. ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసల కోర్చి మీరు ‘బాహుబలి’ ద్వారా ఇంతటి గొప్ప విజయాన్నిఅందుకున్నందుకు నాతో పాటుగా సినిమా జగత్తు యావత్తూ గర్వపడుతున్నది. ప్రియమైన రాణా.. బాహుబలిలో నీ నటన అద్భుతం.

విజయోస్తు..దిగ్విజయోస్తు..కీర్..మరకతమణిగా..ఎంఎం క్రీమ్‌గా..కీరవాణిగా..ఆ వాణి నీ శరీరంలో ప్రవహించి బాహుబలికి అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు ఆత్మబంధువుగా గర్విస్తున్నాను. శ్రీవల్లీ సమేతుడైవై పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.’
 
‘బావా బాహుబలి.. పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే ‘రాజులు’ పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను. ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. విజయీభవ.’ అంటూ ప్రభాస్‌ను పొగుడుతూనే ఈ ఏడాదైనా వివాహం చేసుకోవాలంటూ సూచించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాంకర్ అనసూయ తలకు స్వల్ప గాయాలు...