Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిద్ శ్రీరామ్ పాడిన 'సొగసుకే సోకు' మెలోడీ సాంగ్ - 'రిస్క్' మూవీ నుంచి..

risk
, సోమవారం, 27 మార్చి 2023 (11:33 IST)
'సిక్స్ టీన్స్' సీక్వెల్‌గా ఆ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తంతో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నపాన్ ఇండియా మూవీ 'రిస్క్'. ఈ చిత్రానికి సంబందించిన  ఫస్ట్ సింగల్ లవ్లీ రొమాంటిక్ మెలోడీగా ఘంటాడి కృష్ణ కంపోజ్ చేశారు. పాపులర్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన 'సొగసుకే సోకు' తెలుగులో, 'ఇత్ని ఖూబ్ సూరత్' హిందీలో సింగర్ మహమ్మద్ హైమత్, 'అజ్హ్హగుకే అజ్హ్హగూట్టన్' తమిళ్‌లో సింగర్ అర్జున్ విజయ్, 'సొగసిగే మెరుగు' కన్నడ గీత రచనతో సింగర్ సిద్ధార్థ్ బేలమన్నుపాడారు. మార్చ్ 24న శుక్రవారం సాయంత్రం 06:05 గంటలకు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా నాలుగు పాటలను విడుదల చేసారు. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెజెండరీ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన యలమంచిలి రవి శంకర్, హీరో ఆదిత్య ఓం, ఉప్పల్ ఏం.ఎల్.ఏ బేతి సుభాష్ రెడ్డి, తెలంగాణ బి సి కమిషన్ ఛైర్మన్ వకుళాభరణ రామకృష్ణ రావు, సామజిక వేత్త దుండ్ర కుమార స్వామి, రావి సురేష్ రెడ్డి, గడ్డం రవి, విజయ్ వర్మ, దర్శకుడు ఆర్.కె. ఇంకా చిత్రంలోని నటీనటులు సాంకేతికవర్గ సభ్యులు పాల్గొన్నారు.
 
తెలుగు లిరికల్ సాంగ్ విడుదల చేసిన నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ... "సిద్ శ్రీరామ్ పాడిన 'సొగసుకే సోకు' మెలోడీ సాంగ్ ఘంటాడి కృష్ణ అద్భుతంగా కంపోజ్ చేశారు. ఘంటాడి కృష్ణ మొదట్లో మంచి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. మళ్ళీ ఇన్నాళ్లకు సంగీతానికే పరిమితం కాకుండా దర్శక నిర్మాతగా రిస్క్ చేసాడు. జీవితంలో రిస్కులు ఎదురుకుంటేనే ఏదైనా సాధించగలం. ఎంతో రిస్క్‌తో కూడుకున్న ఈ ప్రాజెక్టుతో తప్పక విజయం సాధిస్తాడని అనుకుంటున్నాను. ఈ రోజు నా చేతులమీదుగా పాపులర్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన 'సొగసుకే సోకు' తెలుగు సాంగ్‌ను విడుదల చేయించినందుకు చాలా ఆనందంగా వుంది. పాట చాలా అద్భుతంగా వుంది డెఫినెట్‌గా చిత్రానికి ప్లస్ అవుతుందని నమ్ముతున్నాను" అన్నారు.
 
తెలుగు మోషన్ పోస్టర్ విడుదల చేసిన  మైత్రి మూవీ మేకర్స్ అధినేత యలమంచిలి రవి శంకర్ మాట్లాడుతూ.. "నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో దేవుడు వరమందిస్తే పాట విని ఎవరు ఇంత అద్భుతమైన పాట ఇచ్చారు అనుకున్నా అప్పట్లో ఆడియో సీడీల్లో మళ్ళీ మళ్ళీ వినేవాడిని. ఒకే సారి నాలుగు భాషల్లో పాట విడుదల చేయడం ఘంటాడి కృష్ణని అభినందిస్తున్నాను. ఈ రోజు విడుదల అయిన సిద్ శ్రీరామ్ రొమాంటిక్ మెలోడీ సాంగ్ లిరికల్‌గా, విజువల్‌గా చాలా బాగుంది. ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాను. ఘంటాడి కృష్ణ, హీరో సందీప్ అశ్వాల తొలి చిత్రమ్ పాన్ ఇండియాగా సక్సెస్ కావాలని కోరుతున్నాను" అన్నారు.
 
హిందీ లిరికల్ సాంగ్ విడుదల చేసిన హీరో ఆదిత్య ఓం మాట్లాడుతూ... "ఘంటాడి కృష్ణ నాకు మంచి స్నేహితుడు ఆయన నేను కలిసి 'మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు - మా ఇంటికొస్తే ఏం తెస్తారు' చిత్రానికి పనిచేశాం. మెలోడీ సాంగ్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటాడు. రిస్క్ చిత్రంతో దర్శక నిర్మాతగా మారడం అభినందనీయం. ఈ రోజు విడుదల అయిన ఈ పాట చూస్తే అర్థమౌతుంది ఆయన అభిరుచి ఏమిటో? నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా పాటను చిత్రీకరించారు." అన్నారు.
 
తమిళ్ లిరికల్ సాంగ్ విడుదల చేసిన ఉప్పల్ ఏం.ఎల్.ఏ బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ... "తెలంగాణ రాష్ట్రము ఏర్పడకముందు తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ కళాకారులను వివక్ష చూపించేవారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ భాషకు, సంసృతికి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. కళాకారులకు, సాంకేతిక నిపుణులకు సినిమాలలో అవకాశాలు రావడం మొదలైంది. ఈ చిత్రాల్లోని హీరో సందీప్ పాటలో తన హావభావాలు చక్కగా ప్రదర్శించాడు. సినిమా పరిశ్రమలో మరో తెలంగాణ హీరోగా నిలబడిపోవాలని కోరుకుంటున్నాను. కరోనా కాలంలో సినిమాలు తీయడమనేది పెద్ద రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కరోనా కాలం ప్రారంభించిన సినిమాలే ఎన్నో సినిమాలు నిలిపివేశారు. అలాంటిది ఆ టైంలో సినిమా స్టార్ట్ చేసి ఇప్పుడు పూర్తి చేసి పైగా పాన్ ఇండియా సినిమా తీయడమనేది ఘంటాడి ధైర్యానికి మెచ్చుకోవాలి. ఘంటాడి కృష్ణ ఎంతో కష్టపడి రిస్క్ తీసుకుని చేసిన ఈ చిత్రం తప్పక విజయం సాధించాలని ఆశిస్తున్నాను." అన్నారు.
 
కన్నడ లిరికల్ సాంగ్ విడుదల చేసిన తెలంగాణ బి సి కమిషన్ చైర్మన్ వకుళాభరణ రామకృష్ణ రావు... "ఏ రంగంలోనైనా చేసే పనిమీద ఏకాగ్రత ఉండాలి. ఈ రోజు ఘంటాడి కృష్ణ చేసిన ఈ 'రిస్క్' పాటలను ఒకే సారి నాలుగు భాషల్లో విడుదల చేయడం, అవి అందరి మన్ననలు పొందడం అనేది అతను పడ్డ శ్రమకు గుర్తింపు లభించిందని చెప్పాలి. మన తెలంగాణ బిడ్డ సందీప్ అభినయం అద్భుతంగా వుంది. అమ్మాయిల మనసు తొలిచిత్రంతోనే దోచుకున్నాడనిపిస్తుంది. ఘంటాడి కృష్ణ, సందీప్‌ల తొలి చిత్రమే పాన్ ఇండియా చిత్రం కావడం, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఒకే సారి పాటలను విడుదల చేయడం ఒక రికార్డు గా నిలిచిపోతుంది" అన్నారు.  
 
ఈ చిత్ర నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ... "ఇంత మంది మహానుభావులు నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసి, తమ కాలాన్ని వెచ్చించినందుకు శిరసా పాదాభివందనం చేస్తున్నాను. 'సిక్స్ టీన్స్' సినిమాకు కొనసాగింపుగా రెండవ చిత్రం చేద్దామని చాలా కాలం క్రితం అనుకున్నాను. ఆ చిత్రంలోని దేవుడు వరమందిస్తే.. మన తెలుగులోనే కాదు కన్నడ భాషలో ఫ్రెండ్స్ అనే టైటిల్‌తో వచ్చింది. అప్పట్లో యూట్యూబ్ లేదు కేవలం ఆడియో సి డిలు మాత్రమే ఉండేవి. కన్నడలో ఆకాష్ ఆడియో ద్వారా విడుదలైంది నా పాట హిట్ కావడంతో 25 లక్షల సిడిలు అమ్మడం జరిగిందని కంపెనీ అధినేత తెలిపారు. 
 
ఇప్పుడైతే వ్యూస్ రికార్డు వుంది. ఈ చిత్రం పూర్తి కావడానికి నా ఒక్కడి శ్రమ కాదు. నన్ను రావి సురేష్ రెడ్డి, గడ్డం రవి, మహేష్ కాలే, గుర్రం నరసింహులు ఎంతో ప్రోత్సహించి,  సహకారం అందించారు. అంతేకాకుండా నా యూనిట్ సభ్యుల సపోర్ట్ కూడా మర్చిపోలేను. డి ఓ పి జగదీష్ కుమార్, కొరియోగ్రాఫేర్స్, ప్రొడక్షన్, ఎడిటర్ శివ శార్వాణి, స్టంట్ మాస్టర్ శంకర్ ఇలా అందరి సహకారంతో చిత్రాన్ని పూర్తి చేయగలిగాను" అన్నారు.
 
ఈ చిత్రంలో నటించిన హీరో సందీప్ అశ్వా మాట్లాడుతూ... " ఘంటాడి కృష్ణ నన్ను హీరోగా పెట్టి సినిమా రంగానికి పరిచయం చేయడం, సినిమా విజయవంతంగా పూర్తి చేసి నన్ను ఈ రోజు ఈ స్థానంలో నిలపెట్టినందుకు, పోస్టర్‌పై హీరోగా నా బొమ్మ చూడాలనుకున్నాను నా కల నెరవేర్చినందుకు నా జీవితాంతం రుణపడి వుంటాను. ఈ రోజు పాటలే మీరు చూసారు అద్భుతంగా ఉన్నాయని ఆశీర్వదించారు. సినిమా కూడా ఆ రేంజ్‌లోనే ప్రేక్షకులకు తెలియచేస్తున్నాను. తప్పక ఈ సినిమాను థియేటర్లో చూసి మా లాంటి కొత్త హీరోలను, టెక్నిషన్స్‌ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను." అన్నారు.
 
నటుడు, నిర్మాత, పి విజయ్ వర్మ మాట్లాడుతూ... " అన్నం వండితే ఒక్క మెతుకు చుస్తే అది తినడానికి రెడీ అయ్యిందని, ఈ రోజు ఈ పాటలను చుస్తే అర్ధమైపోయింది. సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఉంటుందని పాట చిత్రీకరణ వినడానికి అద్భుతంగా వుంది. ఘంటాడి తప్పక ఈ చిత్రంతో దర్శకుడిగా మరిన్ని మూవీస్ చేస్తాడని అనుకుంటున్నాను " అన్నారు.
 
ఇంకా ఈ కార్యాక్రమంలో రావి సురేష్ రెడ్డి, గడ్డం రవి, తమిళ్ పాట పాడిన గాయకుడు అర్జున్ విజయ్, కన్నడ పాట పాడిన సింగర్ సిద్ధార్థ్ బేలమన్ను, హిందీ పాట పాడిన గాత్రధారి మహమ్మద్ హైమత్ చిత్రంలోని మరో ముగ్గురు హీరోలు తరుణ్ సాగర్, విశ్వేష్, అర్జున్ ఠాకూర్‌లు మాట్లాడారు. యాంకర్ స్రవంతి చొక్కారాపు వ్యాఖ్యానంతో సభ అలరించింది.  
 
తారగణం : సందీప్ అశ్వా, సానియా ఠాకూర్, జోయా ఝవేరి, తరుణ్ సాగర్, అర్జున్ ఠాకూర్ , విశ్వేష్,  అనీష్ కురువిళ్ళ, రాజీవ్ కనకాల, కాదంబరి కిరణ్, దువ్వాసి మోహన్, టార్జాన్, టి ఎన్ ఆర్, జబర్దస్త్ టీం-- అప్పారావు, రాజమౌళి,రాము తదితరులు నటించారు.
 
టెక్నికల్ టీం :
బ్యానర్: జి కె మిరకిల్స్
డైరెక్టర్: ఘంటాడి కృష్ణ,
మ్యూజిక్ డైరెక్టర్ : ఘంటాడి కృష్ణ (జి కె)నిర్మాణ పర్వేక్షణ : రావి సురేష్ రెడ్డి,
నిర్మాణ సహకారం : గడ్డం రవి,  
డీవోపీ: జగదీశ్ కొమరి
ఎడిటర్: శివ శార్వాణి
ఫైట్స్: శంకర్ మాస్టర్
కో - డైరెక్టర్ : బన్సీ కోయల్కర్
ఆర్ట్: మురళి,
ప్రొడక్షన్ డిజైనర్ : రాహుల్,ఆనంద్ కస్తూరి,
కోరీయోగ్రాఫర్స్ : రఘు అజయ్ సాయి, వెంకట్ డీప్, అజ్జు, మెహర్,
రైటర్స్ క్రివ్ : శివ, నవీన్, నరేన్,
స్టూడియోస్ ; రిథమ్, అమూల్య, షేడ్స్,రచనా సహకారం : శివ, నరేన్,కాస్ట్యూమ్ డిజైనర్ : శైలజ, 
కో - ఆర్డినేటర్ & పి.ఆర్.ఓ   : రాంబాబు వర్మ
పోస్టర్ డిజైనర్స్ : ఈశ్వర్, కిషోర్ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్ చరణ్ బ్లాక్ బ్లస్టర్ గేమ్ ఛేంజర్ వచ్చేసింది..