Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి చేతుల మీదుగా ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ

Advertiesment
చిరంజీవి చేతుల మీదుగా ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ
, శనివారం, 5 అక్టోబరు 2019 (13:01 IST)
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరుగనుంది. ఇందుకోసం ఆయన ఈ నెల ఆరో తేదీన తాడేపల్లికిరానున్నారు. ఈ విషయాన్ని ఎస్‌వీఆర్‌ సేవాసంఘం అధ్యక్షుడు భోగిరెడ్డి రాము తెలిపారు. 
 
గురువారం స్థానిక కాపు కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో రాము మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణకు చిరంజీవి అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. 
 
మౌలిక వసతులు, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చిరంజీవి అభిమానులు సహకారం అందించాలన్నారు. సుమారు 40 వేల మంది కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్‌ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. 
 
6వ తేదీన మెగాస్టార్‌ చిరంజీవి హైదారాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి తాడేపల్లిగూడెం వస్తారన్నారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఐ.నాగు, జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్‌, బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ, టీడీపీ నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, కాపుసంఘం నాయకులు వడ్డీ రఘురాం, మాకా శ్రీనివాసరావు, అడపాల నారాయణ, మారిశెట్టి ఆజయ్‌, ఎస్వీఆర్‌ సేవాసంఘం సభ్యులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొలి ముద్దు అనుభవం అదుర్స్... డేటింగ్ కూడా చేశా : కంగనా రనౌత్