మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ తొలిసారి ఒక స్వతంత్ర సమరయోధుడు పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆయన సరసన నయనతార హీరోయిన్‌గా నటించారు. ఇక విపరీతమైన అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి సర్వత్రా ప్రశంశలు కురుస్తున్నాయి.
మెగాస్టార్ తన స్పెల్ బౌండింగ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారని, అలానే నిర్మాత రామ్ చరణ్ పెట్టిన ఖర్చు తాలూకు ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనపడిందని అంటున్నారు.
దర్శకుడిగా సురేందర్ రెడ్డి సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, అలానే అమితాబ్ సహా ఇతర పాత్రధారులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించినట్లు చెప్తున్నారు.
ఇకపోతే సినిమాకు అద్భుతంగా టాక్ రావడంతో, తన కుమారుడు మరియు సైరా నిర్మాతైన రామ్ చరణ్‌తో మెగాస్టార్ చిరంజీవి తమ సినిమా విజయానందాన్ని పంచుకున్నారు. కాగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.