Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జన్మనిచ్చిన ఆ మహనీయుడుని స్మరించుకుంటూ...

venkatrao anniversary

ఠాగూర్

, సోమవారం, 30 డిశెంబరు 2024 (17:03 IST)
మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్రావు వర్థింతిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు వర్థంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ నివాసంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ పూజలో తల్లి అంజనా దేవి, సోదరుడు నాగబాబు దంపతులు, చిరంజీవి దంపతులు పాల్గొన్నారు. వీరందరితో కలిసి చిరంజీవి తన తండ్రి చిత్రపటానికి పూల మాల వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం తాలూకు ఫోటోలు,  వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. "జన్మనిచ్చిన ఆ మహనీయుడిని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
 
మరోవైపు, చిరంజీవి కొత్త చిత్రాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన బింబిసారా దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో సినిమా చేయనున్నారు. ఇటీవలే అధికారికంగా ఈ ప్రాజెక్టుపై ప్రకటన కూడా వచ్చింది. నేచురలో స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సీనియర్ దర్శకులతో కాకుండా యువ దర్శకులతో చిరంజీవి కొత్త కొత్త చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నప్ప నుంచి ప్రీతి ముఖుంధన్ లుక్