Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వస్తున్నా మన సీమకి అంటూ స్పెష‌ల్ విమానంలో మెగాస్టార్ చిరంజీవి

Advertiesment
airport-chiranjeevi
, బుధవారం, 28 సెప్టెంబరు 2022 (17:25 IST)
airport-chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి త‌న నూత‌న చిత్రం గాడ్ ఫాద‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనంతపూర్ బ‌య‌లుదేరి వెళ్ళారు. కొద్దిసేప‌టి క్రిత‌మే హైద‌రాబాద్‌లోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానంలో బ‌య‌లుదేరారు.  ఈ సంద‌ర్భంగా.. వస్తున్నా మన సీమ కి... మీ  ప్రేమ కోసం.. అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈరోజు సాయంత్రం అనంతపూర్ లోని మైదానంలో వేడుక జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఆ ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ క‌టౌట్లు ఏర్పాటు చేశారు. వాటిపై డ్రోన్‌ల సాయంతో పూల వ‌ర్షం కురిపించారు. ఈరోజు రాత్రికి ఈ వేడుక జ‌ర‌గ‌నుంది.
 
ఇప్ప‌టికే ప‌లు సినిమాలు రాయ‌ల‌సీమ వేదిక‌గా వేడుక‌లు జ‌రుపుకోవ‌డం ప‌రిపాటి అయింది. అయితే చిరంజీవి సినిమా వేడుక ఇక్క‌డ జ‌రుపుకోవ‌డం ప్ర‌త్యేక సంత‌రించుకుంద‌ని తెలుస్తోంది. ఇక్క‌డ రాజ‌కీయ పార్టీకి ప్రాధాన్య‌త వ‌హిస్తున్న నాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. బాల‌కృష్ణ‌కు ఆయ‌న సినిమాల‌కు ఇక్క‌డ వాతావ‌ర‌ణ‌తోనూ, ప్ర‌జ‌ల‌తోనూ సంబంధం వుంది. కానీ చిరంజీవి ఎప్పుడో ఒక‌టి, అర సినిమా తీశాడు మిన‌హా ఇక్క‌డ ప్రాంత ప్ర‌జ‌ల‌తో పెద్ద‌గా సంబంధాలులేవు. పైగా వై.ఎస్‌.జగ‌న్ పాల‌న చాలా బాగుంద‌ని ఇటీవ‌లే చిరంజీవి స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. క‌నుక‌నే ఈ ప్రాంతం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంద‌ని తెలుస్తోంది. ఆయ‌న ప‌ర్య‌ట‌న కోసం అక్క‌డ పోలీసు బందోబ‌స్తు ఎ.పి. ప్ర‌భుత్వం చూసుకుంటోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జక్కన్న-మహేష్ బాబు చిత్రంలో.. అవెంజర్స్ హీరో క్రిస్..?