Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా వివాహం - ప్ర‌ముఖుల ఆశీస్సులు

Advertiesment
AR Rahman, Khatija Rehman, Riaz Deen
, శుక్రవారం, 6 మే 2022 (19:35 IST)
AR Rahman, Khatija Rehman, Riaz Deen
ఆస్కార్ అవార్డు గ్ర‌హీత సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్  ఆడియో ఇంజనీర్ అయిన రియాస్దీన్ షేక్ మొహమ్మద్‌ను వివాహం చేసుకుంది. గ్రామీ అవార్డు గెలుచుకున్న స్వరకర్త తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఖతీజా,  రియాస్దీన్ వివాహానికి సంబంధించిన చిత్రాన్ని పంచుకున్నారు. 
 
పోస్ట్‌లో..: "సర్వశక్తిమంతుడు ఈ జంటను ఆశీర్వదిస్తాడు...మీ శుభాకాంక్షలు మరియు ప్రేమకు ముందుగానే ధన్యవాదాలు.ష అని పేర్కొన్నాడు రెహ‌మాన్‌. వివాహ వేడుకలోని కుటుంబ ఫోటో వేదికపై AR రెహమాన్ దివంగత తల్లి చిత్రపటం ద‌గ్గ‌ర తీశారు. వివాహం ఎప్పుడు, ఎక్క‌డ జ‌రిగింద‌నే వివ‌రాలు రాయ‌లేదు.
 
ఇక ఖతీజా ఇన్‌స్టాగ్రామ్‌లో తన పెళ్లికి సంబంధించిన ఫోటోను షేర్ చేసింది.  "నా జీవితంలో చాలా ఎదురుచూస్తున్న రోజు. నా వ్యక్తి రియాస్దీన్‌తో వివాహం. కాస్ట్యూమ్ కాన్సెప్ట్ మరియు స్టైల్‌గా శ్రుతి అగర్వాల్, కాస్ట్యూమ్ అసిస్టెంట్- కృతి బైద్."
 
AR రెహమాన్ పోస్ట్  వ్యాఖ్యలను చూసిన‌ గాయని శ్రేయా ఘోషల్: "ఖతీజా రెహమాన్, రియాస్దీన్‌లకు హృదయపూర్వక అభినందనలు. అందమైన జంటను దేవుడు ఆశీర్వదిస్తాడు.ష‌  ఇలా వ్రాశారు. ప్ర‌ముఖ నిర్మాత బోనీ కపూర్  రాస్తూ, "మిస్టర్ అండ్ మిసెస్ AR రెహమాన్‌కి అభినందనలు, ఈ జంట చాలా సంతోషంగా మరియు ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను.ష అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ఆర్ఆర్ నుంచి కొమరం భీముడో వీడియో సాంగ్