నాగార్జున అక్కినేని `మ‌న్మ‌థుడు 2` సెన్సేష‌న్... ర‌కుల్ ఇర‌గ‌దీసిందిగా..

బుధవారం, 10 జులై 2019 (14:33 IST)
కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
 
రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆడియో విడుద‌ల‌ను త్వ‌ర‌లోనే నిర్వ‌హించ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. మంగ‌ళవారం ఈ సినిమాలో అవంతిక పాత్ర‌లో న‌టించిన ర‌కుల్ ప్రీత్ క్యారెక్ట‌ర్‌ను ప్రోమో రూపంలో రిలీజ్‌ చేశారు. ఈ టీజ‌ర్‌ను ఇలా రిలీజ్ చేసారో లేదో యూట్యూబ్‌లో అలా సెన్సేష‌న్ అవ్వ‌డం స్టార్ట్ చేసింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చిక్కుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి హీరోయిన్‌... ఈడీ నోటీసులు జారీ