ఎన్టీఆర్ అంటే... 'నా ప్రాణం లెక్కచేయనంతగా' ఇష్టం : మంచు మనోజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయనని యంగ్ హీరో మంచు మనోజ్ సంచలన వాఖ్యలు అన్నారు. ట్విట్టర్ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్ సమాధానం ఇస్తూ తారక్‌పై తనకున్న అభిమానాన్ని చాట
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయనని యంగ్ హీరో మంచు మనోజ్ సంచలన వాఖ్యలు అన్నారు. ట్విట్టర్ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్ సమాధానం ఇస్తూ తారక్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ''అన్నా మీకు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టం?'' అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్ ఈ విధంగా తన మనసులోని మాటను తెలియజేశారు.
''నా ప్రాణం లెక్కచేయనంతగా(స్మైల్)'' అని ట్వీట్ చేశారు. ఇంకేముంది ఈ ట్వీట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులంతా మంచు మనోజ్‌కి ధన్యవాదాలు, సూపర్ అన్నా అని కామెంట్స్ చేశారు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక మల్టీస్టారర్ చిత్రం వస్తే బాగుంటుందని మరో అభిమాని కోరుకున్నాడు.
మనోజ్ ఇచ్చిన సమాధానంతో తారక్ అభిమానులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం మనోజ్ మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ప్రసన్న దర్శకత్వంలో ''సీతా మహాలక్ష్మి''( మదర్ ఆఫ్ ర్యాంబో) అనే చిత్రంలో, ఎస్.కె. సత్య దర్శకత్వంలో ఓ చిత్రం, అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు.