Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో... ఎవరు?

manoj mounika reddy
, ఆదివారం, 17 డిశెంబరు 2023 (11:56 IST)
మరో టాలీవుడ్ హీరో తండ్రికాబోతున్నాడు. ఆయన ఎవరో కాదు మంచు మనోజ్. ఇటీవల ఆయన భూమా నాగ మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ యేడాది మార్చిలో ఇరు వైపుల కుటుంబ పెద్దల సమ్మతితో వారిద్దరూ రెండో వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్ శుభవార్త చెప్పారు. త్వరలో తాను తండ్రిని కాబోతున్నానని వెల్లడించారు. ఇది తమకు ఎంతో సంతోషకర సమయం అని, అందరూ తమ ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ మేరకు మంచు మనోజ్ ట్వీట్ చేశారు.
 
'అత్తమ్మ శోభా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా... ఈ సంతోషకరమైన వార్తను అందరితో పంచుకుంటున్నా. అత్తమ్మా... నువ్వు, భూమా నాగిరెడ్డి మామ మరోసారి అమ్మమ్మ, తాతయ్యలు అయ్యారు. మా చిన్నారి ధైరవ్ అన్న కాబోతున్నాడు. నాకు తెలుసు... పైనుంచి మీరు మీ ఆశీస్సులను మాకు అందిస్తూ, మా కుటుంబం ఎదుగుదలను అనుక్షణం పరిరక్షిస్తూ, మీ అశేష ప్రేమను మాపై కురిపిస్తూ ఉంటారు. మా అమ్మ నిర్మల, మా నాన్న మోహన్ బాబుల ఆశీస్సులతో, కుటుంబ సభ్యులం అందరి ప్రేమాభిమానాలతో ముగ్ధులమవుతున్నాం' అంటూ మంచు మనోజ్ తన ట్వీట్‌లో వివరించారు.
 
కాగా, గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్... పెళ్లి తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. అటు సినిమా, ఇటు బుల్లితెర షోతో బిజీ అయ్యారు. వాట్ ద ఫిష్ అనే సినిమా చేస్తున్న మంచు మనోజ్... ఉస్తాద్ అనే టీవీ షో కూడా చేస్తున్నారు. తండ్రికాబోతున్న మంచు మనోజ్‌కు పలువురు సినీ సెలెబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.15 లక్షల సూట్ కేసుతో ఎలిమినేటైన యావర్