Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

Ritika Singh

ఐవీఆర్

, మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (19:45 IST)
Sony LIV సరికొత్త విడుదల ‘బెంచ్ లైఫ్’ ఒక ఉద్యోగి కార్పొరేట్ జీవితాన్ని సరికొత్తగా చూపించేందుకు వాగ్దానం చేస్తోంది. ఇది ఏ యాక్టివ్ ప్రాజెక్ట్ లేని ఉద్యోగి బెంచ్‌గా పిలవబడే ఐటి ప్రపంచంలో అంతగా తెలియని వాస్తవాల కథనాన్ని అందిస్తుంది. బెంచ్‌లో ఉండటం ఆనందిస్తూ కార్పొరేట్ సంస్కృతి  హెచ్చుతగ్గుల గుండా పయనించే హాస్యభరిత స్నేహితుల సమూహాన్ని ఈ కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది. ఆకాంక్షలు ఉండే వ్యక్తులు మొదలుకొని దేన్నీ అంతగా పట్టించుకోని వారి వరకు బాలు, మీనాక్షి, ఇషా, రవి ప్రతి ఒక్కరి పాత్ర కూడా తమ క్యారెక్టర్ మార్పు చెందే విధానంతో కథాంశానికి ప్రత్యేకతను తీసుకువస్తుంది. 
 
అలాంటి మార్పు మీనాక్షిని కూడా అనుసరిస్తుంది. ఆమె దర్శకురాలు కావాలనుకుంది, కానీ కార్పొరేట్ లూప్‌లో చిక్కుకుంది. ప్రతిభావంతులైన నటి రితికా సింగ్ ఈ పాత్రను పోషించారు. ఇటీవల తన పాత్ర వెనుక ఉన్న అసలు ప్రేరణను ఆమె వెల్లడించారు. “బెంచ్ లైఫ్‌లో నా పాత్ర పరివర్తన మా దర్శకురాలు మానసా శర్మ నిజ జీవిత కథ. ఆమె నా ముందు ప్రత్యక్ష ఉదాహరణ. ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుండి తన స్వంత సిరీస్‌కి దర్శకత్వం వహించడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మహిళలు తమ కలలను వెంబడించడం, వారి హృదయం వారిని ఎక్కడికి తీసుకువెళుతుందో దానికి పూర్తిగా కట్టుబడి ఉండటం ద్వారా తమ అభిరుచిని సజీవంగా ఉంచుకోవడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. సామాజిక నిబంధనలు, అంచనాలను ధిక్కరించడానికి, నిజంగా వారు ఉండాలనుకుం టున్నట్లుగా ఉండటానికి ఎంతో ధైర్యం కావాలి. బెంచ్ లైఫ్‌లో ఆ పాత్రను పోషించినందుకు నేను చాలా సంతోషిం చాను’’ అని అన్నారు.
 
Sony LIV 'బెంచ్ లైఫ్'కు మానస శర్మ దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక కొణిదెల దీన్ని నిర్మించారు. వైభవ్ రెడ్డి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్, చరణ్ పేరి, ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, తులసి, తనికెళ్ల భరణి వంటి భారీ తారాగణాన్ని కలిగి ఉన్న బెంచ్ లైఫ్ పరిస్థితులను తట్టుకోవడం, ఆనందాన్ని అనుసరించడాన్ని దృశ్యరూపంలో అందిస్తుంది. దీనికి పి.కె దండి సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: దనుష్ భాస్కర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్