హీరోలంటే వెర్రెక్కిపోతున్న కుర్రాళ్లు... అభిమాన సంఘాలు నిషేధించాలి... ఎవరా మాట అంటుంది?
హైదరాబాద్ : కొందరు పిల్లలు తమ అభిమాన నటుల పేరుతో అభిమాన సంఘాలు నెలకొల్పి తమ కష్టార్జితాన్ని నీళ్లపాలు చేస్తున్నారని, జూదం, సింగల్ నెంబర్ లాటరీల కంటే ప్రమాదకరంగా మారిన అభిమాన సంఘాలను నిషేధించాలని తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు విజయవా
హైదరాబాద్ : కొందరు పిల్లలు తమ అభిమాన నటుల పేరుతో అభిమాన సంఘాలు నెలకొల్పి తమ కష్టార్జితాన్ని నీళ్లపాలు చేస్తున్నారని, జూదం, సింగల్ నెంబర్ లాటరీల కంటే ప్రమాదకరంగా మారిన అభిమాన సంఘాలను నిషేధించాలని తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు విజయవాడలో ఒక ఫోరం కూడా ఏర్పాటవుతోంది. ఎవడో సినిమాలో వేషాలు వేసి, రెండు చేతులా ఆర్జిస్తూ, తమ కష్టంతో తమ పిల్లలతో ఫ్లెక్సీలు భారీ కటౌట్‌లు పెట్టించికుంటూ తమ కుటుంబాలను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆయా నటులకు అభిమాన సంఘాలు పెట్టి విద్యపై దృష్టి నిలపలేక పోతున్నారని ఆరోపిస్తున్నారు. అభిమానుల మధ్య గొడవలు పెట్టి కొందరు సినీ నటులు ఏమీ పట్టనట్లు ఉంటున్నారని, అసలు అభిమాన సంఘాలు రద్దు చేస్తే సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలుగకుండా ఉంటుందని తల్లితండ్రులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.
అసలు తమ నటుడిని చూసేందుకు కూడా అవకాశం కల్పించకుండా తమపై పెంచుకున్న అభిమానాన్ని బలహీనతగా భావిస్తూ యువకుల జీవితాలతో ఆడుకుంటూ జూదం కంటే కూడా తీవ్రమైన వ్యసనంగా మార్చిన నటుల అభిమాన సంఘాలను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్ మొదలైంది. అభినుల ద్వారా వచ్చిన ఆదరణను తమ స్వార్థానికి వాడుకుంటూ, సినిమాల ప్రదర్శన బాగా నడిచేలా చేసుకుని లబ్ది పొందటం వారికి అలవాటుగా మారిందని పేర్కొంటున్నారు.
పెరిగిన ప్రజాదరణని ఇతర స్వార్థ ప్రయోజనాలకు తాకట్టు పెట్టి లాభపడటం కొందరు నటులకు పరిపాటి అయందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కర్ణాటకలోని కోలారులో ఒక అభిమానిని దారుణంగా హత్య చెయ్యటంతో ఆ కుటుంబం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లందని, ఇలాంటి సంఘటనలు అరికట్టాలంటే అభిమాన సంఘాలను నిషేధించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
క్యారెక్టర్, మంచి హృదయం కలిగిన నటులను గౌరవించవచ్చని, తమ జీవితంలో సరిగాలేని నటులను సినిమాలో చూపిన నటనను ఆరాధిస్తూ ఆదర్శంగా తీసుకుని మోసపోతున్న తమ పిల్లల భవిష్యత్ కాపాడాలని కోరుతున్నారు. వెంటనే అభిమాన సంఘాలను నిషేధించి వాటిని ప్రోత్సహించే నటుల మీద, నిర్వహించే అభిమానుల మీదా జూదం కింద, బెట్టింగ్‌లకు పెట్టే కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.