Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయిలు నన్ను వాటేసుకోవడంతో షాక్ తిన్నా... సమంత

యువకులు హగ్‌ చేసుకుంటే ఆశ్చర్యపోవాలి కానీ.. యువతులు చేస్తే ఆశ్చర్యమేమిటని ఆలోచిస్తున్నారా.. అవును.. సమంత.. అలాగే చెబుతోంది. హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని ఒక మహిళా కళాశాలకు వెళ్లింది. గర్ల్స్‌ కాలేజీకి వెళ్తానని సమంత చెప్పగానే, ఆశ్చర్యానికి గురైన మంచు

Advertiesment
అమ్మాయిలు నన్ను వాటేసుకోవడంతో షాక్ తిన్నా... సమంత
, సోమవారం, 26 సెప్టెంబరు 2016 (19:26 IST)
యువకులు హగ్‌ చేసుకుంటే ఆశ్చర్యపోవాలి కానీ.. యువతులు చేస్తే ఆశ్చర్యమేమిటని ఆలోచిస్తున్నారా.. అవును.. సమంత.. అలాగే చెబుతోంది.  హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని ఒక మహిళా కళాశాలకు వెళ్లింది. గర్ల్స్‌ కాలేజీకి వెళ్తానని సమంత చెప్పగానే, ఆశ్చర్యానికి గురైన మంచు లక్ష్మి, బాయ్స్‌ కాలేజీకి వెళ్తే డబ్బులొస్తాయని అంటావని భావించానని అనగా, సమంతా నవ్వుతూ.. తనకు లేడీ ఫ్యాన్స్‌ ఎక్కువ అని తెలిపింది. ఆ కళాశాలలో దాదాపు గంటన్నర సేపు గడిపిన సమంత, 60 వేల రూపాయలు వారి నుంచి సేకరించింది. 
 
అక్కడ యువతులు తనను హగ్‌ చేసుకోవడంతో ఆశ్చర్యానికి గురయ్యానని, కొంత షాక్‌కు కూడా లోనయ్యానని చెప్పింది. కాగా వారు ఇచ్చిన మొత్తంలో నుండి సామాన్లు కొనేందుకు ఖర్చైన 10 వేల రూపాయలు తీసేయగా, మిగిలిన 50 వేల రూపాయలకు మరో మూడు రెట్లు వేసి 2 లక్షల రూపాయలు ఇచ్చింది. అలాగే తమ ఎన్జీవో ప్రత్యూష నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తానని చెప్పింది. దీంతో సదరు కుటుంబానికి ఓ 3 లక్షల రూపాయలు సాయం అందింది. ఈ ప్రత్యూష ఫౌండేషన్‌ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది సమంత. 
 
తాను మిడిల్‌క్లాస్‌ అమ్మాయినని..  అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని, దీంతో తన కుటుంబం మొత్తం తనపై ఆధారపడి ఉందని, అలాగే ప్రతి ఒక్కరికీ కుటుంబ బాధ్యతలు ఉంటాయని, వాటిని సక్రమంగా నిర్వర్తించాలని, కష్టాలకు వెరవకూడదని మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే, 2012లో సంభవించిన ఘటన తన ఆలోచనలను మార్చివేసిందని, తన జీవితంలో చోటుచేసుకున్న ఓ సంఘటనతో మూడు నెలల పాటు తీవ్ర నిరాశలో కూరుకుపోయానని తన కష్టాలను కూడా వివరించింది. తన తల్లి చెప్పిన మాట మాత్రం బతకాలని భావించానని, అందుకే ప్రత్యూష ఫౌండేషన్‌ ను ప్రారంభించానని, దాని ద్వారా చేతనైనంత సాయం చేస్తున్నానని సమంత తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇద్దరూ నాకు మంచి స్నేహితులు: అరుంధతి విలన్