Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Advertiesment
Mahesh Babu's niece Janviswaroop

చిత్రాసేన్

, బుధవారం, 29 అక్టోబరు 2025 (10:48 IST)
Mahesh Babu's niece Janviswaroop
హీరోయిన్ గా వారసత్వాన్ని నిలిపేందుకు వెలుగులోకి వస్తోంది జాన్విస్వరూప్. సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు మరియు మంజుల ఘట్టమనేని కుమార్తె జాన్విస్వరూప్. త్వరలో పెద్ద తెరపైకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. నేడు జాన్వి స్వరూప్ ఘట్టమనేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందమైన పొటోలను విడుదల చేశారు. తను నటనతోపాటు డాన్స్ లో కూడా శిక్షణ తీసుకుని వెండితెరపై రావడానికి అర్హత సంపాదించుకుంది.
 
కాగా, ఒకప్పుడు సూపర్ స్టార్ క్రిష్ణ తన కుమార్తె మంజులను నటిగా పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించగానే అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ప్రతిబంధకాలు ఎదురయినా పట్టుదలతో ఆమె షో అనే ఒక్క సినిమా చేసి తనేంటో నిరూపించుకుంది. ఇప్పుడు ఆమె కుమార్తె జాన్వీ అభీష్టం మేరకు సినిమాతారగా రావడం విశేషం.

మంజుల భర్త స్వరూప్ చాలా సినిమాల్లో నటుడిగా అందరికీ పరిచయమే. ఇప్పుడు కుమార్తెలు కూడా సినీమారంగంలోకి రావడం అనే మార్పు రావడం చాలా ఆనందంగా వుందని మంచు లక్మీ వంటి వారు వెల్ కమ్ చెబుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు కూడా తెరంగేట్రం చేయనున్నాడనే విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర