నైజాంలో ‘మహర్షి’ రికార్డు... ఇంత‌కీ ఏంటా రికార్డ్..?

శనివారం, 15 జూన్ 2019 (15:08 IST)
సూపర్ స్టార్ మహేష్ మ‌హేష్ బాబు - సూప‌ర్ హిట్ మూవీస్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం మ‌హ‌ర్షి. ఇది మ‌హేష్ బాబుకి 25వ సినిమా కావ‌డం విశేషం. మహర్షి సూపర్ సక్సెస్ సాధించడంతో మహేష్ బాబుతో పాటు ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. 
 
కెరీర్ పరంగా వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్న తమ సూపర్ స్టార్, త్వరలో చేయబోయే 26వ సినిమా సరిలేరు నీకెవ్వరుతో హ్యాట్రిక్ విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నారు. ఇక మహర్షి సినిమా నైజాం ప్రాంతంలో ఒక అద్భుతమైన రికార్డుని నెలకొల్పింది. 
 
ఈ సినిమా నైజాంలో రూ.30 కోట్లకు పైగా షేర్‌ని సాధించి ఇంకా 102 థియేటర్లలో అక్కడ విజయ ఢంకా మోగిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఓవర్ఆల్‌గా రూ.101 కోట్ల షేర్ మార్కును దాటేసింది. మహర్షి 6వ వారంలో కూడా మంచి వసూళ్లు రాబడుతుండటం విశేషం. మ‌హేష్ 26వ చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఇద్దరు కుమారుల ఫోటోను పోస్ట్ చేసిన ఎన్టీఆర్.. లవకుశలని కామెంట్స్