Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహా శివరాత్రి కానుకగా #PSPK27FirstLook

Advertiesment
మహా శివరాత్రి కానుకగా #PSPK27FirstLook
, బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (17:35 IST)
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే పవన్ నటించిన వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధంగా ఉంది. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాతో పాటు క్రిష్ సినిమా కూడా పూర్తి చేస్తున్నాడు పవన్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది.
 
ఓ వైపు క్రిష్.. మరోవైపు అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు పవర్ స్టార్. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత క్రిష్ నుంచి వస్తున్న సినిమా ఇది. పవన్ కళ్యాణ్‌తో 100 కోట్లతో చిన్న సైజ్ బాహుబలి తీస్తున్నాడు క్రిష్. 200 ఏళ్ళ కిందటి కథాంశంతో ఈ సినిమా వస్తుంది. ఇందులో వజ్రాల దొంగగా పవన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది.
 
అంతేకాదు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. కోహినూర్ వజ్రం నేపథ్యంతో ఈ సినిమా వస్తుంది. నిధి అగర్వాల్ హీరోయిన్. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. 
 
మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. హైదరాబాద్‌ శివార్లలో ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో ఛార్మినార్ సెట్ వేసారు. అక్కడే కీలకమైన పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు క్రిష్. 

కుస్తీ నేపథ్యంలో ఈ సినిమాలో భీకరమైన పోరాట సన్నివేశాలుంటాయని.. అవి కొన్నేళ్ల పాటు గుర్తుంచుకునేలా క్రిష్ తెరకెక్కిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యమున్న పవన్.. కుస్తీ సన్నివేశాల్లో ఎలా ఉండబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను ఈ స్థాయికి కార‌ణం శ్రీ‌రామ్‌గారేః అల్లు అరవింద్