తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కుర్రకారు హీరోయిన్లలో మెహ్రీన్ ఒకరు. 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అయింది.
Advertiesment
, మంగళవారం, 14 నవంబరు 2017 (16:22 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కుర్రకారు హీరోయిన్లలో మెహ్రీన్ ఒకరు. 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అయింది.
ఇటీవల 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్' చిత్రాలతో మంచి విజయాన్ని రుచిచూసింది. ఇపుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన "జవాన్" చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందన్న ధీమాలో ఉన్నారు.
ఇపుడు ఇదే కోవలో మాస్ హీరో గోపిచంద్ సరసన నటించే ఛాన్స్ మెహ్రీన్ కొట్టేసింది. కొత్త దర్శకుడు చక్రి డైరెక్షన్‌లో గోపిచంద్ ఓ మూవీ చేయనుండగా ఇందులో మెహ్రీన్‌ని కథానాయికగా తీసుకోవాలని భావిస్తున్నారట. మరి దీనిపై పూర్తి క్లారిటీ త్వరలోనే రానుంది.
మెహ్రీన్ తన హవా ఇలానే కొనసాగిస్తే రానున్న రోజులలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా మారడం ఖాయమని అంటున్నారు. అందుకే టాలీవుడ్ సెలెబ్రిటీలు.. మెహ్రీన్ హవా మామూలుగా లేదని అంటున్నారు.