Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరో గోపీచంద్ - మారుతి కాంబినేష‌న్‌లో జీఏ2 పిక్చ‌ర్స్

హీరో గోపీచంద్ - మారుతి కాంబినేష‌న్‌లో జీఏ2 పిక్చ‌ర్స్
, గురువారం, 7 జనవరి 2021 (11:04 IST)
"ప్ర‌తిరోజు పండ‌గే" వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌రువాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేయ‌బోయే సినిమాపై అంతటా ఆస‌క్తి, ఉత్కంఠ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో మ్యాచో హీరో గోపీచంద్‌తో ఓ సూప‌ర్ డూప‌ర్ క‌మ‌ర్షీయ‌ల్ ఎంట‌ర్‌‌టైన‌ర్‌ని తెర‌కెక్కించ‌డానికి రంగం సిద్ధం చేశారు. 
 
మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీంతో ముచ్చ‌ట‌గా మూడోసారి జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - మారుతి కాంబినేష‌న్ సెట్ అయింది. 
 
గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ ద్వారానే మారుతి 'భ‌లేభ‌లే మ‌గాడివోయ్', 'ప్ర‌తిరోజు పండ‌గే' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్స్ బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ చంద్ - మారుతి కాంబినేష‌న్‌లో సినిమా రాబోతుంద‌నే ప్ర‌క‌ట‌న‌ కూడా వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేయ‌డం జ‌రిగింది. 
 
'ప్ర‌తిరోజు పండ‌గే' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మారు‌తి చేయ‌బోయే సినిమాపై వ‌చ్చిన పుకార్ల‌కు సెటైర్లు వేస్తూ, మారుతి మార్క్ స్టైల్‌లో ఓ హ్యూమ‌ర‌స్ వీడియోని సిద్ధం చేసి విడుద‌ల చేశారు, ప్ర‌స్తుతం ఈ ఎనౌన్స్ మెంట్ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. 
 
ఈ వీడియోకి ప్ర‌ముఖ న‌టుడు రావుర‌మేశ్ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం కొసమెరుపు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ రాబోతుంది, దీనికి సంబంధించిన టైటిల్ లుక్, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ త్వ‌ర‌లో అధికారికంగా విడుద‌ల అవ్వ‌బోతున్నాయి.
 
హీరో - గోపీచంద్
స‌మ‌ర్ప‌ణ - అల్లు అరవింద్
బ్యాన‌ర్ - జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్
నిర్మాత‌ - బ‌న్నీవాసు
ద‌ర్శ‌కుడు - మారుతి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్ మహారాజా వారసుడు ఇప్పుడే సినిమాల్లోకి రాడట?