Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బట్టల రామస్వామి బయోపిక్ అంత సోలో బాయ్ హిట్ కావాలి : వివి వినాయక్

Advertiesment
VV Vinayak,  Gautham Krishna, Ramya Pasupuleti

దేవీ

, బుధవారం, 2 జులై 2025 (13:36 IST)
VV Vinayak, Gautham Krishna, Ramya Pasupuleti
సతీష్ ఒక దర్శకునిగా ఇండస్ట్రీకి వచ్చి బట్టల రామస్వామి బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. తాజాగా సోలో బాయ్ అనే యూత్ ఫుల్ చిత్రాన్ని రూపొందించారు. సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సోలో బాయ్ చిత్రం లో బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటిస్తూ అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
 
త్రిలోక్ సిద్దు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. జుడా సంధ్య ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రఘు కుంచే, కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ తదితరులు హాజరై సోలో బాయ్ చిత్ర రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేశారు.
 
అనంతరం వివి వినాయక్ మాట్లాడుతూ,  నిర్మాత సతీష్ ఒక దర్శకునిగా ఇండస్ట్రీకి వచ్చి బట్టల రామస్వామి బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. చాలా సాధారణ స్థాయి నుండి ఈరోజు నిర్మాతగా మారడానికి ఎంతో కష్టపడి సతీష్ ఇక్కడ వరకు వచ్చారు. ఈ చిత్రంలో నటించిన గౌతమ్ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి విజయం సాధించి సతీష్ ప్రయాణానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను" అన్నారు.
 
రఘు కుంచే మాట్లాడుతూ, ఓటిటి ద్వారా  విడుదల చేసిన బట్టల రామస్వామి బయోపిక్ ఎంతో మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆర్పి పట్నాయక్ తో కలిసి చేసిన కాఫీ విత్ ఎ కిల్లర్ ఎంతో పాపులర్ అయింది. ఇప్పుడు సోలో బాయ్ ద్వారా వెండితెరపై రానున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
కె ఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్యాషన్ తో వచ్చి సినిమాలు చేసే అతి తక్కువ మందిలో సతీష్ ఒకరు. అది అతని సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. డైరెక్టర్ కావాలనుకున్న అతని కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను  అన్నారు.
 
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, గతంలో నారా రోహిత్ సోలో చిత్రం ఎంత విజయం సాధించిందో ఇప్పుడు సోలో బాయ్ చిత్రం కూడా అంతే విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సతీష్ ఇంకా మంచి నిర్మాణ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.
 
దర్శకుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఈ సినిమాలో అన్ని రకాల జోనర్లు కనిపిస్తూ ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అవుతుంది. గౌతమ్ కృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు. అలాగే ఇద్దరు హీరోయిన్లు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అదేవిధంగా చిత్రంలో నటించిన ప్రతి నటీనటులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సినిమాలో పాటలు సంగీతం చాలా బాగా వచ్చాయి.  మంచి కంటెంట్ తో విజయం సాధించిపోతున్నామని మాకు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది. మా నిర్మాత ఈ చిత్రం ద్వారా గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పరిశ్రమకు ఇంకెంతమందిని పరిశీలించాలని అనుకుంటున్నాను" అన్నారు.
 
నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ, ఈ సినిమా గౌతం సినీ కెరియర్లో ఒక మంచి మైల్ స్టోన్ కావాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సోలో బాయ్ చిత్రం ప్రేక్షకులందరిదీ. నేను సినిమాకు చాలా కరెక్ట్ అయ్యాను. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు సోలో బాయ్ రాబోతుంది. చిత్ర టెక్నికల్ టీమ్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాలో నటించిన ఇతర నటినటులు అంతా చాలా బాగా చేశారు. మీడియా వారు ఈ చిత్రానికి బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.
 
హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ, నేను బిగ్ బాస్ కు వెళ్లక ముందు ఈ సినిమా మొదలైంది. మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఎన్నో విషయాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ ఎంతో సీనియర్ నటినటులు మాతో నటించినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే మురళి నాయక గారి కుటుంబానికి మేము అండగా నిలిచి ఆర్థిక సాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఆ కుటుంబానికి ఇప్పటికే ఎంతోమంది సహాయం చేశారు, ఇంకా మీరు ఎందుకు ఇస్తున్నారు అని అన్నారు. మురళి నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు. ఆయనకు మర్యాద ఇచ్చి మాట్లాడండి. జై హింద్" అంటూ ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

NTR: హృతిక్, ఎన్టీఆర్‌. ను కలిసి చూడాలంటే వార్ 2 తెరపైనే