దర్శకరత్న దాసరినారాయణరావుకు ఇద్దరు కుమారులు. అందులో ఒకరైన దాసరి ప్రభు కనిపించడంలేదని నిన్నటి నుండి మీడియా ఛానల్స్‌లో ప్రముఖంగా వినిస్తుంది. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు కూడా నమోదైందని సమాచారం. దీనితో ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీసులు ఆయన జాడ తెలుసుకుంటాం అని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి పంపించారట.
ఐతే కేసు నమోదైన కొన్ని గంటల తరువాత ప్రభు చిత్తూరులోని తన మొదటి భార్యను కలవడానికి ఆయన వెళ్లారని మరొక వార్తలు కొన్ని మాధ్యమాలలో ప్రసారం చేయడం జరిగింది. కానీ నేటి ఉదయం కూడా ప్రభు మిస్సయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన నిజంగా చిత్తూర్ లో ఉన్నారా లేదా? ఇంతకీ ఆయన ఆచూకీ దొరికిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
నిన్నటి నుండి ఆయన మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతూనే ఉంది. దాసరికి ఇద్దరు కుమారులు కాగా వారిలో పెద్ద కొడుకు ప్రభు, చిన్న కుమారుడు అరుణ్.
150 సినిమాలకు పైగా దర్శకుడిగా ఉన్న దాసరి.. ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు తీర్చారు కానీ ఇంట్లో సమస్యలు మాత్రం తీర్చలేకపోయారు. ఇప్పుడు కూడా దివంగత దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు అదృశ్యమవ్వడం సంచలనంగా మారింది.
జూన్ 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన ఇప్పటి వరకు మళ్లీ తిరిగి రాలేదు. దాంతో ప్రభు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేస్ ఫిర్యాదు చేశారు. పదేళ్ల కింద కూడా ఒకసారి ప్రభు ఇలాగే మిస్ అయిపోయాడు. అప్పుడు కూడా 2008లో కొన్ని రోజులు కనిపించకుండా పోయి.. తర్వాత వచ్చి తన భార్య సుశీలే కిడ్నాప్ చేయించిందని సంచలన ఆరోపణలు చేసాడు.
ఈయన చిత్తూర్ జిల్లాకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. ప్రభు తన మొదటి భార్య దగ్గరకి వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దాసరి నారాయణరావు మరణానంతరం ఆస్తి గొడవలు మరింత తీవ్రతరం అయింది. ప్రభుకు చాలా రోజులుగా భార్యతో ఆస్తి తగాదాలు ఉన్నాయి. 1995లో ప్రేమ వివాహం జరిగింది. మొత్తానికి మరిప్పుడు ప్రభు ఎప్పటికి మళ్లీ కనిపిస్తాడో చూడాలిక.