శ్రీవారి ఆలయానికి ఛైర్మన్‌గా ఓ క్రైస్తవుడా..? వాటికన్ చర్చికి హిందువును ఛైర్మన్ చేస్తారా?

శుక్రవారం, 14 జూన్ 2019 (12:51 IST)
హిందువుల పవిత్ర, సుప్రసిద్ధ క్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ బోర్డుకు ఛైర్మన్‌గా ఓ క్రైస్తవ వ్యక్తిని నియమించే నిర్ణయంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.


వైకాపా చీఫ్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని సర్కారు టీటీడీ పాలక మండలిలో మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే పవిత్ర క్షేత్రమైన శ్రీవారి ఆలయ బోర్డు ఛైర్మన్‌గా జగన్ తన మేనమామ, క్రైస్తవ మత్తస్థుడైన సుబ్బారెడ్డిని నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. 
 
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో క్రైస్తవ మతస్థులకే ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించేవని విమర్శలున్నాయి. ప్రస్తుతం అలాంటి విమర్శలే జగన్ మోహన్ రెడ్డిపై వస్తున్నాయి. వాటికన్ ఆలయానికి ఓ హిందువును నాయకుడిగా నియమించడం కుదురుతుందా? అలాగే హిందూ దేవాలయానికి ఓ క్రిస్టియన్‌ను ఛైర్మన్‌గా చేయడం ఎంతవరకు సబబు అంటూ ట్విట్టర్‌లో పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ చర్చ సీఎం జగన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే టీటీడీ పాలక మండలిని రద్దుచేసే ప్రసక్తే లేదని తితిదే తేల్చి చెప్పేసింది. ఇక మేనమమాను టీటీడీ ఛైర్మన్ చేసే అంశంపై వివాదం తప్పలేదు. టీటీడీ ఛైర్మన్‌లో మార్పులు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమే కానీ.. ఓ హిందూ ఆలయానికి క్రైస్తవ మతస్థుడిని ఛైర్మన్‌గా చేయడమనేది సబబు కాదని జగన్‌కు చాలామంది సూచిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో టీటీడీ సభ్యురాలిగా వున్న ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణ మూర్తి సతీమణి సుధ తన పదవికి రాజీనామా చేశారు. ఆపై సుధ మాట్లాడుతూ.. తాను తన పదవికి రాజీనామా చేయడంలో ఎలాంటి రాజకీయాల్లేవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంచే నియామకమైన తాను.. ఈ ప్రభుత్వ అనుమతి లేనిదే పదవిలో కొనసాగలేనని.. జగన్ సర్కారు అభిమతం మేరకు తిరిగి పదవిని అప్పగిస్తే శిరసా వహిస్తానని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 14-06-2019 శుక్రవారం దినఫలితాలు.. పార్వతీదేవిని పూజించినట్లైతే..?