Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విలువిద్య కోసం బాడీని మార్చుకున్న నాగ‌శౌర్య‌-లక్ష్య టీజర్ అవుట్

విలువిద్య కోసం బాడీని మార్చుకున్న నాగ‌శౌర్య‌-లక్ష్య టీజర్ అవుట్
, శుక్రవారం, 22 జనవరి 2021 (15:42 IST)
Naga Shaurya
ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా నాగ‌శౌర్య త‌న బాడీని మార్చుకున్నాడు. రోజూ చేసే క‌స‌ర‌త్తులు కాకుండా దాని కోసం ప్ర‌త్యేక‌మైన శిక్ష‌కుడి ఆధ్వ‌ర్యంలో బాడీని తీర్చిదిద్దుకున్నాడు. అందుకోసం తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు . ఇది సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’ సినిమా కోస‌మే.
 
కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్రలో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  నాగ‌శౌర్య కిది 20వ చిత్రం.
 
ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ స్టిల్‌ను బ‌య‌ట‌కు విడుద‌ల చేసింది. నాగ‌శౌర్య సూపర్ ఫిట్ బాడీతో, సిక్స్ ప్యాక్‌తో ఉన్న నాగశౌర్య ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంది. తాజాగా  నాగశౌర్య బర్త్‌డే సందర్భంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ `ల‌క్ష్య` టీజ‌ర్‌ని విడుద‌ల చేసి ఫ్యాన్స్‌లో ఆనందాన్ని పెంచింది చిత్ర యూనిట్‌. ట్విట్ట‌ర్‌లో యూట్యూబ్‌లో ఈ టీజ‌ర్ ట్రెండింగ్‌లో ఉంది.
 
”చాలామందికి ఆట‌తో గుర్తింపు వ‌స్తుంది. కానీ ఎవ‌డో ఒక‌డు పుడ‌తాడు,.. ఆట‌కే గుర్తింపు తెచ్చేవాడు” అంటూ విల‌క్ష‌ణ న‌టుడు జగపతిబాబు వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. ఈ సినిమాలో ఆర్చ‌రీలో అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించిన వ్య‌క్తిగా నాగశౌర్య క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. రెండు విభిన్నమైన గెటప్‌లలో దర్శనమివ్వ‌డంతో నాగ‌శౌర్య‌ పాత్ర‌లో ర‌క‌ర‌కాల షేడ్స్ ఉన్నాయ‌న్న విష‌యం అర్థం అవుతోంది. 
 
చివ‌ర‌లో `ప‌డిలేచిన వాడితో పందెం చాలా ప్ర‌మాద‌క‌రం..అంటూ జ‌గ‌ప‌తి బాబు చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. కాల‌బైర‌వ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ టీజ‌ర్‌కు మరింత బలాన్నిఇచ్చింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
 
 ప్ర‌స్తుతం ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: రామ్‌రెడ్డి, సంగీతం:  కాల‌బైర‌వ‌, ఎడిట‌ర్‌: జునైద్‌, నిర్మాత‌లు: నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సంతోష్‌ జాగర్లపూడి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హై ఓల్టేజీ అంటే సూర్య‌నే అట‌!.. తెలుగులో బోయపాటితో సినిమా