Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డబుల్ ఇస్మార్ట్ నుంచి రామ్ పోతినేని, కావ్య థాపర్ పై క్యా లఫ్డా సాంగ్

Kya Lafda song still

డీవీ

, సోమవారం, 29 జులై 2024 (15:53 IST)
Kya Lafda song still
డబుల్ ఇస్మార్ నుంచి మొదటి రెండు సింగిల్స్ ఆడియన్స్ ని అద్భుతంగా అలరించి వైరల్ హిట్స్ అయ్యాయి. లీడ్ పెయిర్ రామ్ పోతినేని, కావ్య థాపర్‌ ల థర్డ్ సింగిల్ క్యా లఫ్డా విడుదలతో ఈ మాన్‌సూన్ మరింత రొమాంటిక్ మారింది.
 
క్యా లఫ్డా ఒక అద్భుతమైన ట్రాక్, డిఫరెంట్ అండ్ యూనిక్ కంపోజిషన్ తో ఇన్స్టంట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. డైనమిక్ వోకల్స్ తో   పెర్ఫార్మెన్స్  టెక్నో బీట్‌లను అద్భుతంగా  బ్లెండ్ చేశారు సంగీత దర్శకుడు మణి శర్మ. ఈ పాట ఇన్స్టంట్ గా లిజినర్స్ కు ఎనర్జీ ఇస్తుంది. వెరీ లైవ్లీ మూడ్ లో అలరించింది.
 
ట్రాక్ బ్యాలెన్స్ హుక్ లైన్‌ను కలిగి ఉంది, ప్రోగ్రామింగ్ సూపర్ కూల్ ఫ్లెయిర్‌తో వుంది. పాట మొత్తం చార్మ్ ని యాడ్ చేసింది. క్యా లఫ్డా  ఎంజాయ్ బుల్ మాత్రమే కాకుండా మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తోంది.
 
ధనుంజయ్ సీపాన, సింధూజ శ్రీనివాసన్ రొమాంటిక్ టచ్‌తో తమ వోకల్స్ అందించారు. శ్రీ హర్ష ఈమాని సాహిత్యం కూడా అంతే ఆకట్టుకుంది. ఈ సీజన్‌లో రొమాంటిక్ మెలోడీగా 'క్యా లఫ్డా' రామ్, కావ్యా థాపర్ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీని ప్రజెంట్ చేసింది. వారి కెమిస్ట్రీ పాటకు విజువల్ ఎట్రాక్షన్ యాడ్ చేసింది.
 
టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి, విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లు, ప్రమోషన్‌లతో దూకుడు పెంచారు.
 
పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రంలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ అందించారు.
 
డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.  
 
నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవర నుంచి ఎన్టీఆర్ లుక్ రిలీజ్.. వంటవాడిగా కనిపిస్తాడా?