Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ పబ్బుల్లో మంత్రి కేటీఆర్‌కు వాటాలు : నటి జీవిత

Advertiesment
jeevitha
, గురువారం, 25 ఆగస్టు 2022 (13:58 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌కు హైదరాదాబ్ నగరంలోని పబ్బులు, క్లబ్బుల్లో వాటాలు ఉన్నాయంటూ సినీ నటి జీవిత సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి కేటీఆర్ ఆస్తుల విలువ ఎంత? ఇపుడు ఆయన ఆస్తుల విలువ ఎంత? అని జీవిత రాజశేఖర్ ప్రశ్నించారు. 
 
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ కుటుంబానికి కోట్లాది రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆమె ప్రశ్నించారు. పబ్బులు, క్లబ్బుల్లో మంత్రి కేటీఆర్‌కు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని తనకు చాలా మంది పబ్బులు, క్లబ్బుల యజమానులు తెలిపారని వెల్లడించారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్నారు. దీనికి నిదర్శనమే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు అని ఆమె చెప్పారు. తెరాస ప్రభుత్వానికి దమ్మూధైర్యం ఉంటే బండి సంజయ్‌ను విడుదల చేసి ఆయన పాదయాత్రకు అనుమతించాలని చెప్పారు. అలాగే, తెరాస నేతలకు ధైర్యం ఉంటే వారు కూడా పాదయాత్రలు చేయాలని కోరారు. 
 
ఇకపోతే, ఇటీవల ఢిల్లీలో వెలుగు చూసిన ఢిల్లీ మద్యం స్కామ్‌లో తెరాస ఎమ్మెల్సీ కవిత తప్పు చేయనపుడు, అస్సలు ఈ స్కామ్‌లోని వాస్తవాలను ఆమె బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పైగా, ఆమె పేరును ప్రస్తావించకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టుకు వెళ్లడమేంటని జీవితా రాజశేఖర్ ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాదాసీదా క‌థతో లైగ‌ర్‌- రివ్యూ రిపోర్ట్‌