భార్యను భరించేందుకు సిద్ధమైన కృష్ణవంశీ.. ఎలాగో తెలుసా?

గురువారం, 17 అక్టోబరు 2019 (11:44 IST)
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, సినీ నటి రమ్యకృష్ణ భార్యాభర్తలన్న విషయం తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చంద్రలేఖ', 'శ్రీ ఆంజనేయం' చిత్రాల్లో రమ్యకృష్ణ కనిపించింది. అలాగే ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో వారిద్దరితో కలిసి కృష్ణవంశీ కొత్త సినిమాను రూపొందించనున్నారు. 
 
ఈ సినిమా రంగమార్తాండ పేరుతో తెరకెక్కబోతోంది. ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు. రెడ్‌బల్బ్ మూవీస్, హౌస్‌ఫుల్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. ఉత్తమ దర్శకుడిగా మూడు సార్లు నంది అవార్డులను సొంతం చేసుకున్న కృష్ణవంశీకి ప్రస్తుతం హిట్ సినిమాలు లేవు. 
 
దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ను కొట్టాలని భావించిన కృష్ణవంశీ ఓ మరాఠీ రీమేక్‌తో రాబోతున్నాడు. మరాఠిలో మంచి విజయం సాధించిన 'నటసామ్రాట్' రీమేక్‌కు కృష్ణ వంశీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇంకా ఈ సినిమాలో తన భార్య రమ్యకృష్ణను నటింపజేసి హిట్ కొట్టేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందుకు రమ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆ విషయంలో ప్రియమణికి సపోర్ట్ చేస్తున్న సమంత, అనుష్క