Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

Advertiesment
Krishna Leela second single launched by J.D. Lakshmi Narayana

దేవీ

, మంగళవారం, 27 మే 2025 (18:04 IST)
Krishna Leela second single launched by J.D. Lakshmi Narayana
దేవన్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపోందుతున్న సూపర్ నేచురల్ లవ్ స్టొరీ 'కృష్ణ లీల'. 'తిరిగొచ్చిన కాలం'అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై  జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ & మాటలు- అనిల్ కిరణ్ కుమార్ జి అందించారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్, టీజర్, ఫస్ట్ సింగిల్ కి  కి అద్భుతమైన స్పందన వచ్చింది.
 
తాజాగా జే.డి. లక్ష్మీ నారాయణ కృష్ణ లీల సెకండ్ సింగిల్ “సూరి ఓరి సూరి” సాంగ్ ని లాంచ్ చేశారు. స్టార్ కంపోజర్ భీమ్స్ ఈ సాంగ్ ని ఎనర్జిటిక్ మోటివేషనల్ సాంగ్ కంపోజ్ చేశారు. భాస్కర భట్ల రవి కుమార్  అద్భుతమైన సాహిత్యం రాశారు. జెస్సీ గిఫ్ట్ ఎనర్జిటిక్ పాడారు. ఈ సాంగ్ ఇనిస్టెంట్ హిట్ గా నిలిచింది.
 
ఈ సందర్భంగా జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. యువత కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలనే సందేశం ఈ సాంగ్ లో ఉంది. భాస్కర భట్ల రవి కుమార్ గారు అద్భుతమైన సాహిత్యం రాశారు. ఈ సాంగ్ సినిమాకే కాదు యువతరానికి కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
 
హీరో, డైరెక్టర్ దేవన్ మాట్లాడుతూ.. ధైర్యం, ప్రజా సేవకు ప్రతీక అయిన గౌరవనీయులైన జె.డి. లక్ష్మీ నారాయణ గారు మా చిత్రం కృష్ణ లీల నుండి “సూరి ఓరి సూరి” సాంగ్  విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన ఇక్కడకి రావడం ఈ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా, మా మొత్తం టీంకి స్ఫూర్తిని పెంచింది. తన నిర్భయ సేవ, సత్యం పట్ల నిబద్ధత ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా, ఆయన మా పాటను ఆవిష్కరించడం మేము ఎప్పటికీ గుర్తుంచుకునే క్షణం. “సూరి ఓరి సూరి” పవర్ ఫుల్ మోటివేషనల్ సాంగ్. ఒక తొలి దర్శకుడిగా, తెలుగు సినిమా  లెజెండ్స్ నాకు గొప్ప ప్రేరణగా నిలిచారు. వారు మనకు గొప్పగా కలలు కనడం నేర్పారు. రాజమౌళి గారి  విజన్, సుకుమార్ గారి పొయిటిక్ నరేషన్, సందీప్ రెడ్డి వంగా రా అండ్ ఇంటెన్స్ ప్రజెంటేషన్.. ఇవన్నీ నా ప్రయాణాన్ని బలంగా ప్రభావితం చేశాయి. కృష్ణ లీల ఆ అభిమానం నుండి పుట్టింది. కృష్ణ లీల యూనిట్ తరపున మాకు  మద్దతు ఇచ్చినందుకు జె.డి. లక్ష్మీ నారాయణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి ఆశీర్వాదాలతో ఈ ప్రయాణాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నాము'అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్