Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుకున్నవి సాధించుకున్న పరిపూర్ణుడు కృష్ణ : మురళీమోహన్‌

krishna-murlaimohan
, మంగళవారం, 15 నవంబరు 2022 (11:27 IST)
krishna-murlaimohan
సూపర్‌స్టార్‌ కృష్ణకు, మురళీమోహన్‌ కూ చాలా అవినాభావ సంబంధం వుంది. ఇద్దరూ కాలేజీలో క్లాస్‌ మేట్స్‌. ఇద్దరూ సౌమ్యులు. అందుకే క్లాస్‌లో ముందు కూర్చోపెట్టేవారు టీచర్లు. వీరి అవినాభావ సంబంధం గురించి మురళీమోహన్‌ ఇలా తెలియజేస్తున్నాడు. కృష్ణగారిది మంచి మనసు.  ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడం కానీ, నోరుజారడంకానీ వుండదు. ఆయన అనుకున్నది సాధించుకునే తత్త్వం. మేం చదువుకునే రోజుల్లోనే సినిమాలపై ఆసక్తి గురించి చెప్పేవాడు. 1964కు ముందు మదరాసు వెళ్ళి ప్రయత్నాలుచేశాడు. కానీ చిన్నపాటి వేషాలు రావడంతో వెనక్కువచ్చాడు. ఆ తర్వాత ఆంధ్రప్రజానాట్యమండలి వారితో నాటకాలు వేసి రాజారావుగారి దగ్గర మెలకువలు నేర్చుకున్నారు.
 
నేను 1964నుంచి వ్యాపార రంగంలో వున్నాను. కోయంబత్తూర్‌నుంచి సరుకు వస్తుండేది. ఒక్కోసారి నేనూ వెళ్ళేవాడిని. అలా ఓరోజు వెళుతూ మధ్యలో మదరాసులో దిగాను. కృష్ణతో సాయంత్రం వరకు వున్నాను. ఆ తర్వాత రోజు నాటకం వుంది చూడడానికి రమ్మన్నాడు. వెళ్ళాను. ఈయనే తెల్లగా అందంగా వుంటాడు. ఈయనతోపాటు మరో అందగాడు స్టేజీపైన వున్నాడు. ఆయనే శోభన్‌బాబు. ఇద్దరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. అలా పలువురు సినీ ప్రముఖుల దృష్టిలో పడ్డారు. అయితే ఆయనకు ఆ తర్వాత ఇందిరతో వివాహం జరిగింది.
 
ఆ తర్వాతే మరలా మదరాసు రావడం, సినిమాల్లో ఆదుర్తి సుబ్బారావుగారి ద్వారా అవకాశం రావడం జరిగింది. అది హిట్‌ అయింది. ఆ తర్వాత డూండీగారి సినిమాలో ఛాన్స్‌ వచ్చింది అని చెప్పాడు. అదే గూఢచారి 116. తెలుగు జేమ్స్‌బాండ్‌గా ఆయనకు పేరు రావడం ఆయన కెరీర్‌ మలుపు తిరగడం జరిగింది.
 
కృష్ణది తెనాలి దగ్గర బుర్రిపాలెం అయినా ఏలూరులో కాలేజీ చదివుకు వచ్చాడు. అందుకు కారణం ఏలూరు దగ్గర ఆయనకు పొలాలు వున్నాయి. మాటల్లో తెనాలిలో థియేటర్‌ వుంది అంటూ గొప్పగా చెప్పాడు. అంతకంటే మా ఏలూరులో వున్న థియేటర్‌ గురించి గొప్పగా చెప్పాను. ఎలాగైనా సరే నేను థియేటర్‌ ఓనర్‌ కావాలి అనేవాడు. అలాగే పడవలాంటి కారులో తిరగాలి అని చెప్పేవాడు. అలా ఆయన అనుకున్నవి అన్నీ సాధించుకున్నాడు. తెలుగు సినిమాలో ఎన్నో ప్రయోగాలు చేసి ట్రెండ్‌ సృష్టించాడు. ఆయన సూట్‌ వేస్తే సూట్‌కే అందం వచ్చిందా అన్నట్లుగా వుండేది. మిత్రుడిగా ఆయనకు ఇదే నా నివాళి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను అని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము కోసం మద్దతు తెలిపిన తొలి నటుడు కృష్ణ