Kiran, Esther Narhana, Siri Chandana
కిరణ్, ఎస్తర్ నార్హానా, సిరి చందన కీలక పాత్రలు పోషించిన చిత్రం మాయా. మిస్టీరియస్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం మాయా. రాజేష్ గొరిజవోలు నిర్మాణ సారథ్యంలో రమేష్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన మాయ టీజర్ విడులైంది. టీజర్ విడుదలైంది. హీరోయిన్ సిరి చందన మాట్లాడుతూ.. హీరో కిరణ్ చాలా సపోరిటీవ్ అని, ఆయనతో పోటీపడి నటించానని తెలిపారు. ఎస్తర్ నోర్హానా ఇండస్ట్రీలో ఇంత పెద్ద పేరున్నా.. సెట్ లో టీం అందరితో కలిపోయారన్నారు. మాయా చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో హార్డ్ వర్క్ చేశారని, త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతుందని కచ్చితంగా అందరికి నచ్చుతుందని అన్నారు.
డైరెక్టర్ రమేష్ నాని మొదటిసారి ఇంటికొచ్చి ఈ స్టోరీ చెప్పిన వెంటనే ఒప్పుకున్నానని హీరో కిరణ్ ఆవల తెలిపారు. చిన్న సినిమాలను తొక్కేసారని చాలామంది చెప్తుంటారు, కానీ సినిమాలో విషయం ఉంటే ఎవరు తొక్కలేరని మా చిత్రం నిరూపిస్తుందని నమ్మకంగా తెలిపారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు టీం వర్క్ తో పూర్తి చేసామని, ఇక డైరెక్టర్స్ టీం ల్యాబ్ లో సైంటిస్టుల్లా ప్రతిరోజు చాలా శ్రమించే వారిని పేర్కొన్నారు. చాలా క్లారిటీతో చేశారని ప్రశంసించారు.
మ్యూజిక్ డైరెక్టర్ సూర్య వర్క్ ఎంతో నచ్చిందని, ఈ సినిమాకు ప్రాణం పెట్టి చేశారని కొనియాడారు. డబ్బులు ఎక్కడ వేస్ట్ కాకుండా ప్రొడ్యూసర్ కు ఫేవర్ గా సినిమాను తెరకెక్కించారని వివరించారు. చిన్న సినిమాను పెద్ద సినిమాగా చేసే ఒకే ఒక పవర్ మీడియాకు ఉందని, కచ్చితంగా మా సినిమాను సపోర్ట్ చేసి పెద్ద సినిమా చేయాలని మీడియా మిత్రులకు కిరణ్ ఆవల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఒక సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు, లంచ్ బ్రేక్ లో డైరెక్టర్ రమేష్ ఈ కథ చెప్పారని, అది విన్న వెంటనే ఓకే చేశానని హీరోయిన్ ఎస్తర్ నోర్హానా తెలిపారు. కథ చాలా కొత్తగా ఉంది, ఇలాంటి స్టోరీలు ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలి అని ఓకే చేసినట్లు వెల్లడించారు. అన్ని క్రాఫ్ట్స్ కలిసి ఒక కుటుంబంలా చిత్రాన్ని తెరకెక్కించారని, ఇలాంటి టీం తో వర్క్ చేయడం సంతోషంగా ఉందన్నారు. చెప్పిన కథను తరకెక్కించడంలో డైరెక్టర్ రమేష్ నాని విజయం సాధించాడని నటి ఎస్తర్ నార్హానా పేర్కొన్నారు.
చిత్రాన్ని తెరకెక్కించడంలో టీం ఎంతో సపోర్ట్ చేసిందని డైరెక్టర్ రమేష్ నాని తెలిపారు. హీరోయిన్ ఎస్తర్ కు స్టోరీ చెప్పినప్పుడు నిర్మాత ఎవరూ లేరని కేవలం ఆమె ఉన్నారన్న ధైర్యంతోనే ముందుకెళ్లామని తెలిపారు. ఎస్తర్ ను సౌత్ విద్యాబాలన్ అని అన్నారు. అడగగానే పాత్ర చిన్నదైనా ఒప్పుకున్నందుకు సురేష్ కొండేటికీ ధన్యవాదాలు తెలిపారు. హీరోగా కిరణ్ ఎంతో సపోర్ట్ చేశాడని ఆయన సపోర్ట్ తోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు. చిన్న సినిమా, చిన్న బడ్జెట్ కానీ, మంచి కంటెంట్ అని ప్రేక్షకులందరూ ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. హీరోయిన్ సిరి చందన ఎంతో కూల్ పర్సన్ అని, ప్రొడక్షన్ పరంగా కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు జరిగినా.. ఎక్కడ అసౌకర్యానికి గురికాకుండా ఎంతో ఓపికగా చిత్రానికి సహకరించారని పేర్కొన్నారు. సినిమా ఆధ్యాంతం అలరించే విధంగా ఎక్కడ బోర్ కొట్టకుండా తెరకెక్కించామని డైరెక్టర్ రమేష్ నాని పేర్కొన్నారు.
నిర్మాత రాజేష్ గొరిజవోలు గురించి మాట్లాడుతూ.. సినిమాకు పెద్ద బ్యాక్ బోన్ అని అన్నారు. సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు.