Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కీర్తి సురేష్‌కు బంపర్ ఆఫర్స్: పవన్- మహేష్- అల్లు అర్జున్‌ సరసన శైలజ..

అందాల తార, కీర్తి సురేష్.. టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసింది. నేను శైలజ, రెమో సినిమాలకు తర్వాత నేను లోకల్‌లో నటిస్తున్న కీర్తి సురేష్.. తాజాగా ఒకేసారి ఇద్దరు మెగా హీరోలతో నటించేందుకు సంతకం చేసేసింది.

Advertiesment
Keerthi Suresh Ropes in for Allu Arjun New Tamil Film
, మంగళవారం, 22 నవంబరు 2016 (12:44 IST)
అందాల తార, కీర్తి సురేష్.. టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసింది. నేను శైలజ, రెమో సినిమాలకు తర్వాత నేను లోకల్‌లో నటిస్తున్న కీర్తి సురేష్.. తాజాగా ఒకేసారి ఇద్దరు మెగా హీరోలతో నటించేందుకు సంతకం చేసేసింది. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కీర్తి సురేష్.. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటి తరువాత తమిళనాట వరుస సినిమాలో బిజీ హీరోయిన్‌గా మారింది. 
 
ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొన్నటికి మొన్న పవన్ కల్యాణ్‌తో.. నిన్నటి నిన్న మహేష్ బాబుతో కీర్తి సురేష్ నటించనుందని వార్తలొచ్చాయి. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ సరసన కూడా నటించేందుకు కీర్తి సురేష్ ఒప్పేసుకుందని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నట్లు కీర్తి ఇప్పటికే ధ్రువీకరించింది. అలాగే తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలోనూ కీర్తి నటిస్తుందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోహన్‌బాబు నటప్రస్థానం@41.. ముక్కుసూటి మనిషి.. త్వరలో ఫ్యామిలీతో కొత్త సినిమా?