Katrina Kaif-Vicky Kaushal
బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ శుక్రవారం తమ మొదటి బిడ్డను స్వాగతించారు. ఈ దంపతులకు మగబిడ్డ పుట్టాడు. విక్కీ-కత్రినా తమ కొడుకు రాకను సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో కత్రినా, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కావడంతో వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మనీష్ మల్హోత్రా, ఉపాసన కామినేని కొణిదెలా, నేహా ధూపియా, హుమా ఖురేషి, రకుల్ ప్రీత్ సింగ్, లారా భూపతి, అర్జున్ కపూర్, గుణీత్ మోంగా, శ్రేయా ఘోషల్ వంటి వారు సహా అభినందన సందేశాలను పోస్ట్ చేశారు. పెళ్లయిన నాలుగేళ్లకు తల్లిదండ్రులుగా మారిన ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
విక్కీ, కత్రినా డిసెంబర్ 9, 2021న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో వివాహం చేసుకున్నారు. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో, జోయా అక్తర్ పార్టీలో తాను విక్కీని కలిశానని, అప్పుడే వారి మధ్య ప్రేమ మొదలైందని కత్రినా వెల్లడించింది.