Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''కార్తీక దీపం'' నిరుపమ్ వాయిస్‌కు ఏమైంది..? సోషల్ మీడియాలో చర్చ

Advertiesment
Karthika deepam
, సోమవారం, 2 నవంబరు 2020 (12:52 IST)
Nirupam
'కార్తీక దీపం' సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'సీరియల్స్ కా బాప్‌'గా 'కార్తీక దీపం' పేరు తెచ్చుకుంది. సీనియర్ ఫిల్మ్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సీరియల్‌కు వచ్చే టీఆర్పీ పెద్ద పెద్ద స్టార్లు నటించే సినిమాలకు కూడా రావట్లేదు.
 
ఆ సీరియల్‌లో డాక్టర్ కార్తీక్ క్యారెక్టర్ చేస్తోన్న నిరుపమ్ పరిటాల, దీప పాత్రధారి ప్రేమి విశ్వనాథ్‌కు వీక్షకుల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉంది. నిరుపమ్ ఎవరో కాదు.. సినీ రచయితగా మంచి పేరు పొందిన దివంగత ఓంకార్ కుమారుడు.
 
ఈ విషయం పక్కనబెడితే.. 'కార్తీక దీపం' లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే..? కార్తీక్ (నిరుపమ్‌) గొంతు మారిపోవడం. ఇప్పటిదాకా సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ వచ్చిన నిరుపమ్‌కు ఇప్పుడు ఎవరో గొంతును అరువిస్తున్నారు. ఇది చాలామందికి నచ్చినట్లు లేదు. అందుకు సోషల్ మీడియాలో నిరుపమ్‌నే నేరుగా అడిగేస్తున్నారు ఫ్యాన్స్‌. ఆదివారం నిరుపమ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన ఫొటోనొకదాన్ని షేర్ చేశాడు.
 
అది.. ఇటీవల దసరా కోసం తోటి నటులతో కలిసి చేసిన ఓ టీవీ షోకు సంబంధించింది. దాంతో పాటు, "మీరు నియంత్రించలేని దాని గురించి బాధపడే బదులు, మీరు సృష్టించగల దాని కోసం మీ శక్తిని బదలాయించండి" అనే కోట్‌ను జోడించాడు.
 
దీనిని మెచ్చుకుంటూనే కామెంట్ సెక్షన్స్‌లో అనేకమంది మంది ఫ్యాన్స్ 'కార్తీక దీపం'తో పాటు ఇతర సీరియల్స్‌లో అతని గొంతు ఎందుకు మారిపోయిందనీ, ఏం జరిగిందనీ ప్రశ్నల పరంపర కురపించారు. ఒక అభిమాని, "సీరియల్స్‌లో మీ వాయిస్‌ను మార్చేశారు. ఎందుకు?" అని ప్రశ్నించాడు.
 
"కార్తీక దీపంలో మీ వాయిస్ మ్యాచ్ అవలేదు. ఫస్డ్‌దే బావుంది క్యూట్‌గా ఉంటుంది కార్తీక్ గారు. ప్లీజ్ చేంజ్ ద వాయిస్" అని కామెంట్ పెట్టారు. అయితే ఈ కామెంట్స్‌కు ఇంతదాకా నిరుపమ్ ఆన్సర్ ఇవ్వలేదు. సీరియల్ నిర్మాతలు ఎందుకు నిరుపమ్ వాయిస్ బదులు డబ్బింగ్ వాయిస్ పెట్టారనేది వెల్లడి కావాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రసిద్ధ గీత రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు నటుడు రాజా వివాహం