Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థియేటర్లలో విడుదలకు సిద్దమైన కర్ణ

Advertiesment
karna prerelease
, సోమవారం, 19 జూన్ 2023 (17:08 IST)
karna prerelease
కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, అజయ్, దిల్ రమేష్ నటీ నటులుగా  కళాధర్ కొక్కొండ స్వీయ దర్శకత్వంలో తనే హీరో గా నటిస్తున్న చిత్రం "కర్ణ". ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన  టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 23న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్న సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి  తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ శ్రీ అనిల్ కుర్మాచ‌లం, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
 
అనంతరం గెస్ట్ లుగా వచ్చిన అనిల్ కుర్మాచ‌లం, ప్రసన్న కుమార్,  తుమ్మలపల్లి రామసత్యనారాయణలు మాట్లాడుతూ.. యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, టీజర్ లు బాగున్నాయి. యుద్ధం శరణం శిక్షామి, స్నేహం శూన్యం రక్ష్యామి, లోకం స్వార్థం ప్రక్షామి అనే సంస్కృత వాక్యాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇందులో ఉన్న సెంటిమెంట్ సీన్స్ చూస్తుంటే సినిమా చూడాలనే ఆసక్తి పెంచేశాయి. చట్టానికి చిక్కిన రవికిరణం, సంకెళ్లతో బిగిసిన ప్రతీకారం.. ద్రోహం, విద్రోహం.. కన్నీళ్లతో రగిలే ఆగ్రహం..మేధం నరమేధం రక్తంతో రాసిన శాసనం అంటూ ఉత్కంఠ రేపే సీన్స్ చూస్తుంటే పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగుతున్న సినిమా అనిపిస్తుంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలకు తోడు పల్లెటూరి వాతావరణం, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న "కర్ణ" మూవీ సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చిత్ర యూనిట్ అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.
 
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ వెంకట్, నటులు దిల్ రమేష్, నూకరాజు తదితరులు ఈ నెల  23న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ మంచి ఘోస్ట్ చిత్రం నుంచి ఓ పాప నువ్వు తోపు అనే బీట్ సాంగ్ రిలీజ్