సరదాగా సాగే త్రివిక్రమ్ 'కారందోశ' సినిమా డిసెంబరులో రిలీజ్
'ఏదో పెద్దగా చేసెయ్యాలి. ఇరగదీసెయ్యాలి. ఇంకేదో సాధించేయాలి.. అని కలలు కంటూ క్లారిటీ మిస్సవుతోంది నేటి యువతరం. మాటలు తగ్గించి చేతలు చూపించండి గురూ.. ఒళ్లొంచి పనిచెయ్యండి. సెల్ఫ్‌కి, సమాజాని
'ఏదో పెద్దగా చేసెయ్యాలి. ఇరగదీసెయ్యాలి. ఇంకేదో సాధించేయాలి.. అని కలలు కంటూ క్లారిటీ మిస్సవుతోంది నేటి యువతరం. మాటలు తగ్గించి చేతలు చూపించండి గురూ.. ఒళ్లొంచి పనిచెయ్యండి. సెల్ఫ్‌కి, సమాజానికి పనికొస్తారని చెబుతున్నా'మన్నారు దర్శకుడు త్రివిక్రమ్.జి. శివ రామచంద్రవరపు, సూర్య శ్రీనివాస్, చందన నాయకానాయికలుగా వీణావేదిక ప్రొడక్షన్స్ పతాకంపై త్రివిక్రమ్.జి తెరకెక్కించిన సినిమా 'కారందోశ'. వచ్చే నెలలో విడుదల కానుంది.
ఇదే అంశంపై దర్శకనిర్మాతలు మాట్లాడుతూ... 'చాలా సరదాగా సాగిపొయే అర్థవంతమైన కథతో ఈ సినిమాని తెరకెక్కించాం. ఇటీవలే రిలీజ్ చేసిన ఆడియో, టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నాం' అని చెప్పారు.
ఈ చిత్రంలో వంకాయలసత్యనారాయణ, కాశీవిశ్వనాథ్ ఇతర ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ : సురేష్, కెమెరా : రాజభట్టాచార్య, సంగీతం : సిద్దార్థ్ వాట్కిన్స్, సాహిత్యం : శ్రీరామ్ , నేపద్య సంగీతం : దేవ్ గురు.