శిక్ష పడుతుందనే భయంతో అధికారం చేజిక్కించుకోవాలా?: శశికళపై కమల్ అటాక్
తమిళ రాజకీయ సంక్షోభంపై సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ట్విట్టర్లో చిన్నమ్మను కమల్ హాసన్ టార్గెట్ చేశారు. శశికళకు వ్యతిరేకంగా తమిళనాడు ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేసి
తమిళ రాజకీయ సంక్షోభంపై సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ట్విట్టర్లో చిన్నమ్మను కమల్ హాసన్ టార్గెట్ చేశారు. శశికళకు వ్యతిరేకంగా తమిళనాడు ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాత కమల్ హసన్ ప్రశంసలు గుప్పించారు. అధికారం చేపట్టడంపై రెండు రకాల అభిప్రాయాలను కమల్ హాసన్ వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మహాత్మాగాంధీ రెండు సూక్తులను కూడ ఆయన ఉటంకించారు.
'శిక్ష పడుతోందనే భయంతో అధికారం చేజిక్కించుకోవడం, రెండోది ప్రేమ పూర్వకంగా చేపట్టడం...మహాత్మాగాంధీ (నేను అనుసరించే హీరో) ' అని ఆయన ట్వీట్ చేశారు. కచ్చితంగా తమిళనాడులో ఇదే జరుగుతోందని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక కమల్ హాసన్ ట్వీట్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేగాకుండా మీకు సెల్యూట్ చేస్తున్నాం సార్.. ఏళ్ల తరబడి మమ్ముల్ని మోసం చేసిన చాలామంది సూపర్ స్టార్ల కంటే, ప్రస్తుత రాజకీయాలపై కనీసం స్పందిచేందుకు భయపడేవారికంటే మీరు చాలా బెటర్... నేరుగా భయం లేకుండా అభిప్రాయం చెప్పారు'' అంటూ ఓ నెటిజన్ స్పందించాడు.
కాగా దివంగత సీఎం జయమ్మ స్థానంలో సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు ఆమె నెచ్చెలి శశికళ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా... జయలలిత విధేయుడు పన్నీర్ సెల్వం కూడా అంతే స్థాయిలో పోరాడుతున్న సంగతి తెలిసిందే.