అక్షర హాసన్ ఐరన్ లెగ్గా.. అజిత్ వివేగం ఎలాంటి ఫలితాన్నిస్తుందో?
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్, రజనీకాంత్ అల్లుడు ధనుష్, కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ నటించిన షమితాబ్ సినిమా ఫట్ అయ్యింది. ఈ సినిమా ద్వారానే అక్షర తెరంగేట్రం చేసింది. ఈ సినిమా బాక్సాఫీస
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్, రజనీకాంత్ అల్లుడు ధనుష్, కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ నటించిన షమితాబ్ సినిమా ఫట్ అయ్యింది. ఈ సినిమా ద్వారానే అక్షర తెరంగేట్రం చేసింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో అమ్మడికి సినిమాలు అంతగా కలిసిరాలేదని అందరూ అనుకున్నారు. అయినా ఆపకుండా అక్షర తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఈ క్రమంలో అక్షర సంతకాలు చేసిన బాలీవుడ్ ప్రాజెక్టు కొన్ని అనివార్య కారణాల చేత ఆగిపోయింది.
మరోవైపు అక్షర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న శభాష్ నాయుడు సినిమా షూటింగ్ కూడా కొంతకాలం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫలితంగా కోలీవుడ్, బాలీవుడ్‌కు అక్షర హాసన్ ఐరన్ లెగ్ అనే విషయం అర్థమైపోయింది. కానీ మొదట్లో శ్రుతి హాసన్‌ను కూడా ఇలాగే అన్నారని, ఆ తరువాత అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిందనే విషయాన్ని సినీ పండితులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వివేగం సినిమాలో యాక్ట్ చేస్తున్న అక్షరకు ఈ సినిమా ఏమేరకు మంచి ఫలితాలనిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.