నందమూరి కళ్యాణ్‌రామ్ ఇటీవలే సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. ఆ గేప్‌లో బిగ్ బేనర్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు రాజేంద్ర అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్ర కథ స్పై థ్రిల్లర్ గా రూపొందనుంది. కథ విన్నవెంటనే కళ్యాణ్‌రామ్‌కు నచ్చి వెంటనే ఓకే చేశాడు. కథరీత్యా ఏజెంట్ వినోద్ అనే పేరు పరిశీలనలో వున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా మేకింగ్‌లో వీఎఫ్ఎక్స్ కీలకంగా మారనుందట. అందుకే వాటిని పై శ్రద్ధ పెడుతున్నారు.
మార్చి రెండోవారంలోపు పనులన్నీ ముగించుకు సెట్‌పైకి వెళ్ళనున్నారు. సోమవారంనాడు లాంఛనంగా ఈ సినిమాను పూజతో ప్రారంభించారు. మైత్రీ మూవీస్ అధినేతలు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 1940 బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్పై థ్రిల్లర్ గా రూపొందనున్నదని సమాచారం. అతి కొద్ది సేపట్లలో మరిన్ని వివరాలు తెలియగలవని కళ్యాణ్‌రామ్ ట్వీట్ చేశాడు. కాగా, కల్యాణ్‌రామ్ మల్లిడి వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా చేస్తున్నాడు. అది ఏప్రిల్‌లో పూర్తికానుంది.