Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నందమూరి కళ్యాణ్‌రామ్‌ - కాజల్ అగర్వాల్ నూతన చిత్రం 'MLA' ప్రారంభం

నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా, నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రాబోతోన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ 'MLA'. "మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్" అనేది కాప్షన్. ఈ చిత్రంలో అందాల భామ కాజల్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. T.G. విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ

Advertiesment
kalyan ram
, సోమవారం, 5 జూన్ 2017 (16:28 IST)
నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా, నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రాబోతోన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ 'MLA'. "మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్" అనేది కాప్షన్. ఈ చిత్రంలో అందాల భామ కాజల్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. T.G. విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ LLP మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ LLP బ్యానర్ల సంయుక్త నిర్మాణం లో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తారు.
 
ఈ చిత్రం పూజా కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ లోని ఫిలిం నగర్ సాయిబాబా దేవస్థానంలో జరిగింది. హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌, దర్శకులు ఉపేంద్ర మాధవ్, కొ-ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల, నిర్మాతలు C భరత్ చౌదరి మరియు M. V. కిరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్న ఈ కార్యక్రమం యూనిట్ సభ్యుల మధ్య జరిగింది.
 
నందమూరి కళ్యాణ్‌రామ్‌ తనయుడు సౌర్యా రామ్ మరియు నిర్మాత భరత్ చౌదరి తనయుడు కరణ్ ఈ చిత్రానికి క్లాప్ ఇవ్వగా, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కూతురు తారక అద్విత మరియు నిర్మాత M. V. కిరణ్ రెడ్డి కూతురు ఐక్రా కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దేవుడి పఠాల మీద చిత్రీకరించిన మొదటి షాట్‌కు ప్రముఖ రచయిత కోనా వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు.
 
"ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ చిత్రం హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మంచి చిత్రం అవుతుంది అని నమ్ముతున్నాం. నూతన దర్శకుడు ఉపేంద్ర రాసుకున్న కథ చాలా ఫ్రెష్ గా ఉంది. జూన్ 9 నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం చివరి భాగం లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం", అని నిర్మాతలు తెలిపారు.
 
"టోటల్ న్యూ లుక్‌లో ఎంతో స్టైలిష్‌గా కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమాలో కనపడతారు. నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారికి, చిత్ర నిర్మాతలకి కృతజ్ఞతలు తెలుపుతున్నా. MLA అనే టైటిల్‌కి, కాప్షన్‌కి పూర్తి జస్టిఫికేషన్ ఉంటుంది" అని దర్శకులు ఉపేంద్ర అన్నారు.
 
రవి కిషెన్, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, లాస్యా, మనాలి రాథోడ్ ఈ చిత్రం లోని ప్రధాన నటులు. ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుపుతాము అని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ : T.G. విశ్వప్రసాద్, రచనా సహకారం : ప్రవీణ్ వర్మ, ఆది నారాయణ, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ , ఎడిటింగ్‌: తమ్మిరాజు, సమర్పణ : T.G. విశ్వప్రసాద్, కో-ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభొట్ల, నిర్మాతలు: C భరత్ చౌదరి మరియు M. V. కిరణ్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెడ్‌కు గ్యారంటీ వుందా?