Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలీస్ ఆఫీసర్ సత్యభామ ఏమీ చేసిందంటే.. !

Kajal Aggarwal
, శుక్రవారం, 10 నవంబరు 2023 (16:47 IST)
Kajal Aggarwal
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. “సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీపావళి పండుగ సందర్భంగా “సత్యభామ” సినిమా టీజర్ ఇవాళ రిలీజ్ చేశారు.
 
“సత్యభామ” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే - హత్యకు గురైన ఓ యువతిని రక్షించే క్రమంలో ఆమె ప్రాణాలు కాపాడలేకపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. అప్పటి నుంచి ఆమె గిల్టీ ఫీలింగ్ తో బాధపడుతుంటుంది. పై అధికారులు సత్య..ఈ కేసు నీ చేతుల్లో లేదు అని చెబితే..కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్ అంటుంది సత్య. అమాయకురాలైన యువతిని చంపిన హంతకుల వేట మొదలుపెడుతుంది సత్యభామ. ఈ వేటను మన ఇతిహాసాల్లో నరకాసుర వధ కోసం యుద్ధరంగంలో అడుగుపెట్టిన సత్యభామ సాహసంతో పోల్చుతూ ప్లే అయ్యే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఆకట్టుకుంది. ఈ కేసును క్లోజ్ చేసేది లేదన్న సత్యభామ...యువతి హత్యకు కారణమైన హంతకులను చట్టం ముందు నిలబెట్టిందా లేదా అనే అంశాలతో టీజర్ ఆసక్తికరంగా ముగిసింది.
 
 
నటీనటులు - కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు
 
టెక్నికల్ టీమ్
 
బ్యానర్: అవురమ్ ఆర్ట్స్
స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క
నిర్మాతలు : బాబీ తిక్క,  శ్రీనివాసరావు తక్కలపెల్లి
కో ప్రొడ్యూసర్ - బాలాజీ
సినిమాటోగ్రఫీ - బి విష్ణు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
పీఆర్ఓ: జీఎస్ కే మీడియా
దర్శకత్వం: సుమన్ చిక్కాల
 
 
------------------------------------------------------------------------------
 
పాకిస్థానీ నటి #హనియాఅమీర్‌ను ఆమె సైకో బాయ్‌ఫ్రెండ్ కొట్టింది! ఆమెకు బాధగా ఉంది!!
 
అమీర్ 12 ఫిబ్రవరి 1997న రావల్పిండి, పంజాబ్, పాకిస్తాన్‌లో ముర్రీకి చెందిన పంజాబీ తండ్రి మరియు హింద్‌కోవాన్ తల్లికి జన్మించాడు. ఆమె గాయకుడు అసిమ్ అజార్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి, అయితే 2020లో ఐమా బేగ్‌తో జరిగిన లైవ్ సెషన్‌లో ఆమె దానిని తిరస్కరించింది.
 
షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘జవాన్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు మూడు వారాలైంది. అయితే సినిమాపై ఉన్న క్రేజ్ అంతంత మాత్రంగానే ఉంది. భారతదేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్బుతమైన బిజినెస్ చేస్తోంది. మీరు SRK అభిమాని అయితే, అతనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని మీకు తెలుస్తుంది. ఇప్పుడు, పాకిస్థానీ నటి హనియా అమీర్ కూడా అభిమానిలా కనిపిస్తోంది. నటి చలేయా హుక్‌స్టెప్ చేస్తున్న నటిని చూపించే వీడియోను శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అవును, మీరు విన్నది నిజమే!
 
ఇంతలో, హనియా అమీర్ ప్రముఖ పాకిస్థానీ నటి, ఆమె 'ఇష్కియా', 'దిల్ రుబా' మరియు 'ముఝే ప్యార్ హువా థా' వంటి ప్రముఖ షోలలో పని చేసింది. ఆమె ‘ముఝే ప్యార్ హువా థా’ షోలో మహీర్ పాత్రను కూడా పోషిస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 9 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించిన ఉలగ నాయగన్ పద్మశ్రీ కమల్ హాసన్