Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పక్కా లోకల్.. కాజల్‌కు బాగా కలిసొచ్చింది.. హీరోయిన్‌గా వద్దు.. ఐటమ్ గర్ల్‌గా ముద్దు

హీరోయిన్‌గా టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు నటించేసిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మధ్యలో జనతా గ్యారేజ్‌లో అమ్మడు నటించింది. గ్యారేజ్‌లో కాజల్ అగర్వాల్ నటి

Advertiesment
Janatha Garage
, మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (16:50 IST)
హీరోయిన్‌గా టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు నటించేసిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మధ్యలో జనతా గ్యారేజ్‌లో అమ్మడు నటించింది. గ్యారేజ్‌లో కాజల్ అగర్వాల్ నటిస్తుందంటే.. ఆమేదో హీరోయిన్ అనుకున్నారు. కానీ ఐటమ్ గర్ల్ అనే సంగతి లేటుగానే తెలిసింది. ఇదేంటి.. కాజల్ అగర్వాల్ ఐటమ్ గర్లా అంటూ ఆమె ఫ్యాన్స్ తెగ బాధపడిపోయారు. కానీ కాజల్ అగర్వాల్ ఐటమ్ గర్ల్‌గా బాగా కలిసొచ్చిందంటోంది. 
 
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని కలెక్షన్స్‌తో కుమ్మేస్తున్న చిత్రం "జనతా గ్యారేజ్ ". విడుదలకు ముందే పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో భారీ అంచనాల మధ్య సినిమా విడుదలైంది. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిపోయింది. మిర్చి, శ్రీమంతుడు తర్వాత జనతా గ్యారేజ్‌ ద్వారానూ మూడో హిట్ కొట్టాడు. కానీ ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్‌కు మాత్రం పెద్దగా పేరు రాలేదు. అయితే ఐటెమ్ సాంగ్ చేసిన కాజల్ అగర్వాల్‌కు మాత్రం ఫుల్ క్రేజ్ లభించింది. 
 
ఎందుకంటే.. కొంతకాలం ఆమె సినిమా ఫ్లాప్ కావడంతో.. ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో ఎన్టీఆర్ గ్యారేజ్‌లో ఐటమ్ సాంగుకు ఒప్పేసుకుంది. పాటకు సూపర్‌గా స్టెప్పులేసింది. అంతే పక్కా లోకల్ ద్వారా కాజల్‌కు మంచి పేరు వచ్చేసిందని సినీ జనం అంటున్నారు. దీంతో తమన్నాలా ఇకపై హీరోయిన్‌గా నటిస్తూనే.. ఐటమ్ గర్ల్‌గా ఐటమ్ సాంగ్‌లో చిందులేసేందుకు రెడీ అవుతుందట. దీంతో కాజల్‌కు సూపర్ ఐటమ్ ఛాన్సులు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోగా అరవింద్ స్వామి.. హీరోయిన్‌గా ఎవరో తెలుసా..? తమన్నా అట..