Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోగా అరవింద్ స్వామి.. హీరోయిన్‌గా ఎవరో తెలుసా..? తమన్నా అట..

అరవింద్ స్వామీ.. ఒకప్పుడు ఆడవారి కలల రాకుమారుడు.. అప్పట్లో మగవాళ్ల అందం గురించి చెప్పాలన్నా - అమ్మాయిల కలల రాకుమారుడి గురించి ప్రస్తావించాలన్నా అరవింద్ స్వామిని ఉదాహరణగా చెప్పేవారు. హీరోగా నటించిన కొన

Advertiesment
Aravind Swamy
, మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (16:28 IST)
అరవింద్ స్వామీ.. ఒకప్పుడు ఆడవారి కలల రాకుమారుడు.. అప్పట్లో మగవాళ్ల అందం గురించి చెప్పాలన్నా - అమ్మాయిల కలల రాకుమారుడి గురించి ప్రస్తావించాలన్నా అరవింద్ స్వామిని ఉదాహరణగా చెప్పేవారు. హీరోగా నటించిన కొన్ని సినిమాల తర్వాతి కాలంలో పెద్దగా వెండితెరపై కనిపించని అరవింద్ స్వామి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం "తనీ ఒరువన్" సినిమాతో ఫుల్ క్రేజ్‌ని సంపాదించుకున్నారు. 
 
ఈ క్రమంలో సక్సెస్ ఫుల్‌గానే కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా అరవింద్ స్వామి హీరోగా ఒక సినిమా ప్లాన్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పాలబుగ్గల తమన్నాను ఎంపిక చేశారట. వీళ్లిద్దరూ ప్రధాన పాత్రల్లో ఒక థ్రిల్లర్ సినిమా తెరకెక్కబోతోందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన "శతురంగ వేట్టై" మూవీకి ఇది సీక్వెల్‌గా రూపొందుతోందట. 
 
నితిన్ నటించిన "అఆ" టాలీవుడ్‌కు పరిచయమైన సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రమణ్యం హీరోగా నటించిన సినిమా ఇది. రైస్ పుల్లింగ్ పేరుతో గ్యాంబ్లింగ్ చేస్తూ జీవనం సాగించే వ్యక్తి కథ ఇది. ఇదే నిజమైతే.. తమన్నా బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. ఈ చిత్రంలో అదిరిపోయే రొమాంటిక్ సీన్స్ ఉండనున్నాయట. మరి.. లవ్వర్ బాయ్‌తో మిల్కీ బ్యూటీ ఎపుడు రొమాన్స్ మొదలుపెడుతుందో వేచి చూడాలి. ఈ సీక్వెల్‌లో నటించడానికి వీరిద్దరూ కూడా ఆసక్తిగా వున్నట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమా రంగంలో అలాంటివి తప్పవ్.. పడక సుఖం కోసం ఏమైనా చేస్తారు: ప్రియాంక