Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెడ్‌పైనే కైకాల - మెగాస్టార్ చిరంజీవి రాక‌తో కుటుంబ సభ్యుల్లో ఉత్సాహం

Advertiesment
chirangeevi-kaikala
, సోమవారం, 25 జులై 2022 (17:45 IST)
chirangeevi-kaikala
నవరస నటన సార్వ‌భౌముడు  కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారి ఇంటికి  ఈరోజు అనగా సోమవారం రోజు వెళ్లి స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి గారి సమక్షంలో కైకాల సత్యనారాయణ గారి చేత కేక్ కట్ చేయించారు. ఇక ఈ సందర్భంగా గత కొంత నాలుగవయోభారం రీత్యా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న కైకాల సత్యనారాయణ గారికి మెగాస్టార్ చిరంజీవి అభయం ఇచ్చి త్వరలోనే మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారని మా అందరి మధ్యకు వస్తారని ధైర్యం చెప్పారు. 
 
webdunia
cake cutting
ఇక మెగాస్టార్ చిరంజీవి చూపిన ఈ చొరవకు కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణ గారి సోదరుడు ప్రముఖ నిర్మాత కైకాల నాగేశ్వరరావు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నాన్న గారి పుట్టిన రోజున ఇంటికి రావడం చాలా ఆనందం కలిగించిందని ఏదో వచ్చి వెళ్ళిపోయామని కాకుండా చాలా సమయం వెచ్చించి అన్నయ్య కైకాల సత్యనారాయణ గారితో మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పారని అన్నారు. మెగాస్టార్ ఇచ్చిన ధైర్యంతో కైకాల సత్యనారాయణ గారికే కాక మాకు కూడా చాలా ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చారు. 
 
ఇక మెగాస్టార్ చిరంజీవి, కైకాల సత్యనారాయణ కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్‌ చిత్రాలు వచ్చాయి. స్టేట్ రౌడీ, కొదమ సింహం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, బావగారు బాగున్నారా వంటివి వీరి సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కైకాల సత్యనారాయణ కుమారులు  కైకాల లక్ష్మీనారాయణ,  కైకాల రామారావు  (చిన్నబాబు)  మరియు కైకాల కుటుంబ సభ్యులు అంతా పాల్గొన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సీతా రామం' ట్రైలర్ వైరల్.. రష్మిక ఆ పని చేసిందా? (Video)