'కబాలి' సెన్సార్ పూర్తి.. రిలీజ్ తేదీ ప్రకటన... పది వేల థియేటర్లలో రిలీజ్!
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం కబాలి. యువ దర్శకుడు పా. రంజిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం కబాలి. యువ దర్శకుడు పా. రంజిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'యూ' సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. ఆ వెంటనే 22న చిత్రం విడుదలవుతుందని నిర్మాత కలైపులి ఎస్ థాను ప్రకటించారు.
దీనిపై ఆయన ట్వీట్ చేశారు. "నేటి (సోమవారం) నుంచి 'కబాలి' పండగ మొదలైంది. 152 నిమిషాల నిడివి ఉన్న చిత్రం ప్రేక్షకులను మైమరపిస్తుంది. రజినీ మాయ చేయడం గ్యారెంటీ" అని తన ట్విట్టర్ ఖాతాలో స్పందించాడు. కాగా, ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే కథానాయికగా నటించగా, పా రంజిత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
మరోవైపు.. లింగా చిత్రం తర్వాత వస్తున్న కబాలి.. ప్రపంచ వ్యాప్తంగా పది వేల థియేటర్లలో విడుదల కానుంది. చెన్నై నగరంలోని అన్ని థియేటర్లలో ఈ చిత్రాన్ని తొలి రోజు ప్రదర్శించనున్నారు. అలాగే, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శించనున్నారు.