Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగ్గురు సూపర్ స్టార్లతో నటించనున్న లావణ్య త్రిపాఠి!

''అందాల రాక్షసి'' ఫేం లావణ్య త్రిపాఠికి టైమ్ బాగానే కలిసొస్తుంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ''భలే భలే మగాడివోయ్''తో బంపర్ హిట్ అందుకున్న ఈ భామకు… నాగ్ ''సోగ్గాడే చిన్ని నాయనా'' చిత్రం ఆఫర్ దక్కడంతో మర

Advertiesment
Actress Lavanya Tripathi Thrilled to Work With 3 South Superstars
, మంగళవారం, 12 జులై 2016 (10:51 IST)
''అందాల రాక్షసి'' ఫేం లావణ్య త్రిపాఠికి టైమ్ బాగానే కలిసొస్తుంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ''భలే భలే మగాడివోయ్''తో బంపర్ హిట్ అందుకున్న ఈ భామకు… నాగ్ ''సోగ్గాడే చిన్ని నాయనా'' చిత్రం ఆఫర్ దక్కడంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్‌లో దూసుకెళుతుంది. ఇప్పుడు ఇంకో సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వరుస పరాజయాల్లో ఉన్న శ్రీనువైట్ల.. ఈసారి ఎలాగైనా ఓ హిట్ కొట్టాలని భావించి ఓ కథను సిద్ధం చేసుకున్నాడట.
 
నల్లమలుపు బుజ్జి నిర్మించనున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలోనే వరుణ్ తేజ్‌కు జంటగా లావణ్యను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు శిరీశ్‌కు జంటగా "శ్రీరస్తు శుభమస్తు'' సినిమాలో నటిస్తోంది లావణ్య త్రిపాఠి. మరోవైపు సందీప్ కిషన్ సరసన ''మాయావన్'' సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుంది. సందీప్ కిషన్ హీరోగా సీవీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కే ఆ తమిళ సినిమాలో లావణ్య త్రిపాఠి సైక్రియాటిస్ట్ పాత్రను పోషిస్తుంది. 
 
ఈ సినిమా గురించి లావణ్య మాట్లాడుతూ.. ఇలాంటి రోల్‌ని నేను ఇప్పటివరకూ చేయలేదు. పైగా ఈ సైక్రియాట్రిస్ట్ చాలా స్టైలిష్‌గా ఉంది. ఈ పాత్రను పోషించేందుకు నేను చాలా రీసెర్చ్ చేశాను. కౌన్సిలింగులు ఇచ్చేటప్పుడు వారి హావభావాలు గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. తాజాగా సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందించనున్నఈ సినిమాలోనూ లావణ్య పేరే వినిపిస్తోంది. దీంతో ఈ చిన్నది వరుస సినిమాలతో బిజీ బిజీగా ముందుకు దూసుకుపోతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు-మురుగదాస్ సినిమాకు పరిణీతి చోప్రా హీరోయిన్ కాదట.. రకుల్ ప్రీత్ సింగట?!