Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

Advertiesment
shefali jariwala

ఠాగూర్

, శనివారం, 28 జూన్ 2025 (09:38 IST)
కాంటా లగా పాటతో దేశ వ్యాప్తంగా యువతను ఉర్రూతలూగించిన ప్రముఖ నటి, మోడల్ షపాలీ జరివాలా (42) హఠాన్మరణం చెందారు. శుక్రవారం రాత్రి ఆమె గుండెపోటుతో మరణించినట్టు సమచారం. ఈ వార్త తెలియడంతో చిత్రపరిశ్రమతో పాటు ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారిలో విషాదం నెలకొంది. 
 
శుక్రవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో షపాలీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె భర్త నటుడు పరాగ్ త్యాగి వెంటనే అంధేరిలోని ఉన్న బేల్లేవ్యూ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూపర్ ఆస్పత్రికి తరలించారు. షపాలీ మరణ వార్తపై ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 
 
కాగా, గత 2005లో విడుదలైన కాంటా లగా రీమిక్స్ వీడియో సాంగ్‌తో షఫాలీ జరివాలా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఈ పాటతో ఆమెకు కాంటా లగా గర్ల్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపుతో పాటు విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత  సల్మాన్ ఖాన్ నటించిన "ముజ్సే షాదీ కరోగి" చిత్రంలో ఆమె ఓ చిన్న పాత్రలో కనిపించారు. హిందీ బిగ్ బాస్ సీజన్‌ 13తో పాటు పలు టీవీ రియాలిటీ షోలలో ఆమె పాల్గొన్నారు. 
 
సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే షఫాలీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 33 లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఆమె ఆకస్మిక మరణవార్త తెలిసి అభిమానులు, నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ గాయకుడు మికా సింగ్ స్పందిస్తూ, షఫాలీ మరణం తనను తీవ్ర షాక్‌కు గురిచేసిందని విచారరం వ్యక్తం చశారు. కాగా, షఫాలీ గత 2015లో నటుడు పరాగ్ త్యాగిని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...